Elon Musk: మరో అవకాశం లేదు.. అందుకే కఠిన నిర్ణయం.. ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన ఎలాన్ మస్క్ ..

ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50శాతం ఎక్కువే అని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు.

Elon Musk: మరో అవకాశం లేదు.. అందుకే కఠిన నిర్ణయం.. ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన ఎలాన్ మస్క్ ..

Elon Musk

Elon Musk: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తరువాత కీలక మార్పులు చేస్తున్నారు. పలు విభాగాల్లో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు వారంరోజుల్లోనే 50శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలకు బదులిస్తూ మస్క్ స్పందించారు. ఉద్యోగులను తొలగించే విషయాన్ని సమర్థించుకున్నాడు. కంపెనీ వేల కోట్ల నష్టాల్లో ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మస్క్ పేర్కొన్నాడు.

Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రద్దు చేస్తూ నిర్ణయం

44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలు చేసిన మస్క్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కంపెనీలో సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాడు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ కు 7,500 వరకు ఉద్యోగాలు ఉండగా సుమారు 3,738 మందికి ఇ-మెయిల్ ద్వారా లేఆఫ్ మెయిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఆఫ్‌లకు ముందు ఉద్యోగులు, వినియోగదారుల డేటా భద్రత దృష్ట్యా తాత్కాలికంగా అన్ని కార్యాలయాలను ట్విటర్ మూసివేసింది.

ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుందని, ఈ క్రమంలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదని మస్క్ తెలిపాడు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నామని, చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50శాతం ఎక్కువే అని మస్క్ పేర్కొన్నాడు. ఇదిలాఉంటే ట్విటర్ ఆదాయం తగ్గడానికి మరో కారణం సామాజిక కార్యకర్తలేనని మస్క్ అన్నారు. అమెరికాలో భావ వక్తీకరణ స్వేచ్ఛను వారు నాశనం చేస్తున్నారని మస్క్ తెలిపాడు. అయితే సంస్థకు ఎంతమేర నష్టం కలిగింది, ఆ కార్యకర్తలు ఎవరు అన్నదానిపై మస్క్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.