Financial Crisis Effect On IT Employees : అమెరికా నుంచి భారత్ వరకు..ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు..టెకీల్ని రోడ్డున పడేస్తున్న ద్రవ్యోల్బణం

అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయం నెలకొంది. ఎంత పెద్ద కంపెనీఅయినా అదే పరిస్థితి. లాక్ డౌన్ లలో రెండు మూడు ఉద్యోగాలు (మూన్ లైటింగ్) చేసుకున్న ఐటీ ఉద్యోగులు ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం ప్రభావంతో అసలు ఒక్క ఉద్యోగం అయినా ఉంటుందా? ఊడుతుందా? అనే భయంతో ఉన్నారు. ఈ పరిస్థితి అమెరికా నుంచి భారత్ వరకు ఉంది. 

Financial Crisis Effect On IT Employees : అమెరికా నుంచి భారత్ వరకు..ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు..టెకీల్ని రోడ్డున పడేస్తున్న ద్రవ్యోల్బణం

Financial Crisis Effect On IT Employees

Financial Crisis Effect On IT Employees : అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయం నెలకొంది. ఎంత పెద్ద కంపెనీఅయినా అదే పరిస్థితి. లాక్ డౌన్ లలో రెండు మూడు ఉద్యోగాలు (మూన్ లైటింగ్) చేసుకున్న ఐటీ ఉద్యోగులు ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం ప్రభావంతో అసలు ఒక్క ఉద్యోగం అయినా ఉంటుందా? ఊడుతుందా? అనే భయంతో ఉన్నారు. ఈ పరిస్థితి అమెరికా నుంచి భారత్ వరకు ఉంది.

బీటెక్‌ కంప్లీట్‌ చేశామా! బోనస్‌గా ఏదో ఒక కోర్స్‌ చేశామా! ఐటీ కంపెనీలో జాబ్‌లో చేరిపోయామా! అంతే.. లైఫ్‌ సెటిల్‌.. బిందాస్‌గా బతికేయొచ్చు.. కొంచెం టెన్షన్‌ ఎక్కువే అయినా.. దానికి తగ్గట్టుగా ఇన్‌కమ్‌ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్‌ ఎలాగో ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడయితే.. విదేశాలకు కూడా వెళ్లొచ్చు! డాలర్లను జేబులో వేసుకోవచ్చు! అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్‌ అంటే వెర్రి. కాలు కదలకుండా కంప్యూటర్‌ ముందు పనిచేసే ఉద్యోగమంటే క్రేజ్‌. ఏటా లక్షల మంది బీటెక్‌ పట్టాలు పట్టుకుని రోడ్డుపైకి వస్తున్నారు. వారికి తగ్గట్టే ఐటీ కంపెనీల సంఖ్య కూడా పెరిగింది. సో.. డోంట్‌ వర్రీ. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒక కంపెనీలో జాబ్‌ వస్తుందన్న గ్యారెంటీ.

Tech Jobs Cuts : కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం .. ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం..వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన..

కరోనా టైంలో ప్రపంచమంతా అతలాకుతలమైంది. లాక్‌డౌన్లు పెట్టడంతో జనజీవనం స్తంభించింది. నెల జీతం కోసం పనిచేసే వాళ్లంతా సంపాదన లేక అష్టకష్టాలు పడ్డారు. పెళ్లాం, పిల్లల్ని పోషించడానికి అప్పుల పాలయ్యారు. అయితే.. అంత సంక్షోభంలోనూ.. టెకీలు హ్యాపీగానే ఉన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ ఆప్షన్‌ ఉండటంతో ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని పైసలు కమాయించుకున్నారు. పైగా.. ఆఫీస్‌కు వెళ్లే పని లేకపోవడంతో.. తమ కంపెనీతో పాటు అదనంగా ఒకట్రెండు కంపెనీల్లోనూ జాబ్‌ చేస్కుంటూ బాగానే సంపాదించుకున్నారు. అందుకే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లంటే సొసైటీలో కాస్తంత కుళ్లు. మీకేంటి బాబూ.. ప్రపంచం బద్దలైనా.. హ్యాపీగానే పనిచేసుకుంటారంటూ సెటైర్లు వేస్తుంటారు. కానీ.. ఎప్పుడూ లాభాలే వస్తే అది వ్యాపారం ఎందుకవుతుంది? ప్రతిరోజూ ఈజీగా గడిచిపోతే అది ఉద్యోగం ఎలా అవుతుంది? ఇప్పుడు ఐటీ ఎంప్లాయిస్‌కు కూడా మాంద్యం సెగ తగులుతోంది. స్టార్టప్‌ల నుంచి టాప్‌ కంపెనీల దాకా ఎక్కడా జాబ్‌ గ్యారెంటీ లేకుండా పోయింది. వేలమంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడు పింక్‌ స్లిప్‌ కనిపిస్తుందా అని టెకీలు టెన్షన్‌ పడుతున్నారు. మూడు పువ్వులు.. ఆరు కాయల్లా సాగిపోయే ఐటీ కంపెనీల్లో.. భారీగా ఉద్యోగాల కోతల వెనుక జరుగుతున్నదేంటి?

ఎలన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లాక.. ట్విట్టర్‌లో కోత మొదలైంది. దాదాపు 7500మంది ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా పీకి పారేశాడు. ఇండియాలోనూ ట్విట్టర్‌ ఉద్యోగులపై కత్తి వేలాడుతోంది. ఎందుకిలా చేస్తున్నావంటే.. రోజూ కోట్ల రూపాయల నష్టం వస్తోంది! ఇంతమందిని పోషించడం నావల్ల కాదంటున్నాడు. దాంతో మాక్కూడా నష్టాలే వస్తున్నాయి.. మేం కూడా ఎంప్లాయిస్‌ను తొలగించక తప్పదంటూ మిగతా కంపెనీలు కూడా పాటందుకున్నాయి. ట్విట్టర్‌ బాటలోనే నడిచేందుకు మెటా కూడా రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ అయిన మెటాలో వేల మందికి ఉద్వాసన పలుకుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మెటా చేతుల్లో ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 87 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. అయితే వీరిలో ఎంతమందిని ఇంటికి పంపిస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు. అయితే 18 ఏళ్ల కంపెనీ చరిత్రలో తొలిసారిగా భారీగా ఉద్యోగాల్లో కోత పెట్టడం ఇదే తొలిసారి.

Elon Musk Warning: అలాచేస్తే ట్విటర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తాం.. వార్నింగ్ ఇచ్చిన ఎలాన్ మస్క్

మెటానే కాదు.. అమెరికా టెక్‌ కంపెనీలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం పడటంతో.. ఉద్యోగాల్లో కోతలు తప్పేలా కనిపించట్లేదు. ధరల సెగతో అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. దాన్ని అరికట్టేందుకు పెంచుకుంటూ పోతున్నా యూజ్‌ లేదు. ఈ దెబ్బ టెక్‌ కంపెనీలపైనా పడింది. చాలా కంపెనీలు యాడ్స్‌ తగ్గించుకున్నాయి. బడ్జెట్‌లో కోత పెట్టాయి. దీంతో మెటా నికర లాభం గతేడాదితో పోలిస్తే ఈసారి 52శాతం తగ్గింది. ద్రవ్యోల్బణం దెబ్బ నుంచి ఇప్పట్లో బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు. దాంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దఎత్తున ఉద్యోగుల్ని తొలగించడం తప్పించి.. వేరే మార్గం లేదని మెటా భావిస్తోంది. త్వరలోనే బ్యాడ్‌న్యూస్‌ చెప్పే ఛాన్సుంది.

మరోవైపు మెటా కంటే ముందే అమెరికాలో చాలా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల వేట మొదలుపెట్టాయి. వందో.. వెయ్యో కాదు.. ఏకంగా 45వేలమందిని ఇప్పటికే ఇంటికి సాగనంపాయి. ఈ పని చేసింది చిన్నచిన్న కంపెనీలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్దపెద్ద సంస్థలే. పెద్దోళ్లే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేకపోతే.. ఇక చిన్న కంపెనీలు, స్టార్టప్స్‌ సంగతి ఏంటో అర్థం చేస్కోవచ్చు. కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల్ని తీసేస్తే.. మరికొన్నిట్లో రిక్రూట్‌మెంట్ నిలిచిపోయాయి. వేలమందిని అకస్మాత్తుగా రోడ్డున పడేయటం అన్యాయం కాదా అన్న ప్రశ్నలకు.. పెద్ద కంపెనీలన్నీ ముందుగానే ఆన్సర్లు రెడీ చేస్కున్నాయి. మొదట్లో ఎక్కువమందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాం.. ఇప్పుడు నష్టాల్ని భరించలేక తీసేస్తున్నామంటూ బదులిస్తున్నాయి.

అమెరికాలో హార్డ్‌ డ్రైవర్ల తయారీలో పాపులర్‌ అయిన సీగేట్‌ కంపెనీ కూడా లేఆఫ్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో 8శాతం మందిపై వేటేసింది. గత నెల్లో 3 వేల మంది ఉద్యోగుల్ని తగ్గించుకుంది. చిప్‌ మేకర్‌ ఇన్‌టెల్‌ కూడా సేమ్‌. వచ్చే ఏడాదిలో మూడు బిలియన్‌ డాలర్ల ఖర్చును తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఉద్యోగాల్లో కోత పెట్టాలని డిసైడయింది. ముఖ్యంగా సేల్స్‌, మార్కెటింగ్‌ శాఖల్లో 20శాతం ఉద్యోగుల్ని ఇంటికి పంపించాలని నిర్ణయించుకుంది.

Meta Platform: ట్విటర్ బాటలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉద్యోగుల తొలగింపునకు రంగంసిద్ధం?

పరిచయం అక్కర్లేని మైక్రోసాఫ్ట్‌లోనూ ఇదే పరిస్థితి. గత జులై నెలలో ఒకశాతం ఉద్యోగుల్ని తొలగించారు. అనుకున్న దానికంటే తక్కువ ఆదాయం రావడమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇక యూఎస్‌ నుంచే పనిచేసే కాయిన్‌ బేస్‌ కంపెనీలోనూ 18శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. మొత్తం 1100 మందిని తొలగించారు. ఇక ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నష్టాలే మిగిల్చింది. దాంతో రెండు పర్యాయాల్లో 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. స్నాప్‌చాట్‌ కూడా 20శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంది. వెయ్యికి పైగా ఎంప్లాయిస్‌కు సారీ చెప్పేసి బయటకు వెళ్లగొట్టింది. ఇక షాపిఫైలో వెయ్యి మందిని.. లిఫ్ట్‌లో 760 మందిని తగ్గించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. నష్టాల పేరుతో దిగ్గజ సంస్థలన్నీ వందల మంది ఉద్యోగుల్ని అకస్మాత్తుగా తొలగించుకుంటూ వచ్చాయి. ఇకముందు కూడా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సుందని హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోనే కాదు.. ఇండియాలోనూ ఇదే సిచ్యుయేషన్‌. మన దగ్గర కూడా ఐటీ, ఎడ్‌టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌ సీజన్‌ నడుస్తోంది.