Elon Musk Warning: అలాచేస్తే ట్విటర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తాం.. వార్నింగ్ ఇచ్చిన ఎలాన్ మస్క్

ట్విటర్ ఖాతాల తొలగింపు, నిలిపివేయడం వంటి విషయాల్లో గతంలో ముందుగా హెచ్చరికలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని మస్క్ స్పష్టం చేశాడు. ఏ ఇతర పేరుకు తమ డిస్ ప్లే ను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్ ను తాత్కాలికంగా కోల్పోతారని మస్క్ ట్విటర్ ఖాతాదారులను హెచ్చరించారు.

Elon Musk Warning: అలాచేస్తే ట్విటర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తాం.. వార్నింగ్ ఇచ్చిన ఎలాన్ మస్క్

Elon Musk Warning

Elon Musk Warning: ట్విటర్‌ సంస్థను సొంతం చేసుకున్న తరువాత బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దూకుడు పెంచాడు. ట్విటర్‌లో కీలక మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో బ్లూటిక్ ఖాతాలకు నెలకు 8డాలర్ల చొప్పున ఫీజు విధించాలని మస్క్ నిర్ణయించారు. ఈ క్రమంలో మస్క్ నిర్ణయం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు పలువురు ప్రముఖులు తమ డిస్ ప్లే పేరును ఎలాన్ మస్క్‌గా మార్చి, మస్క్ ఫొటో పెట్టి నిరసన తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Congress Twitter: కేజీఎఫ్-2 సాంగ్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశం.. కాంగ్రెస్ పార్టీ ఏమందంటే?

కొంత మంది ప్రముఖులు తమ డిస్ ప్లే పేరును ఎలాన్ మస్క్ గా మార్చి, వారి ఖాతాకు మస్క్ ఫొటో పెట్టి ట్వీట్లు చేస్తుండటంతో మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విటర్ డిస్ ప్లే‌లో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విటర్ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని అన్నారు.

Twitter Employees: మనసు మార్చుకున్న మస్క్..? తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు.. ఎందుకంటే?

ట్విటర్ ఖాతాల తొలగింపు, నిలిపివేయడం వంటి విషయాల్లో గతంలో ముందుగా హెచ్చరికలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని అన్నారు. ఏ ఇతర పేరుకు తమ డిస్ ప్లే ను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్ ను తాత్కాలికంగా కోల్పోతారని మస్క్ ట్విటర్ ఖాతాదారులను హెచ్చరించారు.