Twitter Employees: మనసు మార్చుకున్న మస్క్..? తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు.. ఎందుకంటే?

ట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న క్రమంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంత మంది సేవలు తప్పనిసరని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరిని తిరిగి ఆఫీసుకు రావాలని ట్విటర్ సంస్థ ప్రతినిధులు కోరారని సమాచారం.

Twitter Employees: మనసు మార్చుకున్న మస్క్..? తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి మళ్లీ పిలుపు.. ఎందుకంటే?

Elon Musk

Twitter Employees: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న విషయం విధితమే. వెంటనే కీలక విభాగాల్లో ఉద్యోగులను మస్క్ తొలగించారు. తాజాగా ట్విటర్‌లో పనిచేసే 50శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఒకరోజులో మిలియన్ డాలర్ల కొద్దీ నష్టాలను చవిచూస్తుందని, ఉద్యోగులను తొలగించడం మినహా తమకు వేరేదారి లేదని మస్క్ తెలిపాడు.

Meta Platform: ట్విటర్ బాటలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉద్యోగుల తొలగింపునకు రంగంసిద్ధం?

గత మూడు రోజుల క్రితం మస్క్ ట్విటర్ లోని సగం మంది ఉద్యోగులకు స్వస్తిపలుకుతూ వారికి ఈమెయిల్ మెస్సేజ్ లుసైతం పంపించారు. తాజాగా ఎలాన్ మస్క్ మనసు మార్చుకున్నాడు. ఇటీవల తొలగించిన 50శాతం మంది ఉద్యోగుల్లో కొందరిని తిరిగి విధుల్లోకి తీసుకొనేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొంతమందిని తిరిగి ఆపీసుకు రమ్మంటూ ట్విటర్ సందేశాలు పంపించినట్లు, జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని, దీంతో పొరపాటున కొంత మందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని చెప్పినట్లు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది.

Twitter Employees: ట్విటర్ నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఔట్..? తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందన్న ట్విట్టర్

ట్విటర్ ను మస్క్ హస్తగతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న క్రమంలో తొలగించిన ఉద్యోగుల్లో కొంత మంది సేవలు తప్పనిసరని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కొందరిని తిరిగి ఆఫీసుకు రావాలని ట్విటర్ సంస్థ ప్రతినిధులు కోరారని సమాచారం. అయితే, ఈ విషయంపై ట్విటర్ యాజమాన్యంగానీ, ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ కానీ స్పందించలేదు.