Twitter Employees: ట్విటర్ నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఔట్..? తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందన్న ట్విట్టర్

గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

Twitter Employees: ట్విటర్ నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఔట్..? తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందన్న ట్విట్టర్

Elon Musk

Twitter Employees: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ చేతుల్లోకి వెళ్లింది. 44బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ట్విటర్ కొనుగోలుకు సన్నద్ధమైన సమయంలోనే ఎలాన్ మస్క్ ఉద్యోగుల కుదింపుపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ట్విటర్‌ను పూర్తిస్థాయిలో తన చేతుల్లోకి తీసుకున్న తరువాత ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎవరు ఎప్పుడు ఉద్యోగం నుంచి తొలగించబడతారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Twitter: ట్విట్టర్‭లో బ్లూ బ్యాడ్జ్ ఉంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలంటూ వార్తలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం

గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని సంస్థ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. శుక్రవారం తన నిర్ణయాన్ని ఉద్యోగులకు తెలియజేయాలని భావిస్తున్న మస్క్, ట్విట్టర్ యొక్క వర్క్-ఫ్రమ్-ఎయిర్వేర్ పాలసీని కూడా వెనక్కి తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ కంపెనీ నిబంధనలు పాటించని ఉద్యోగులు కార్యాలయాలకు నివేదించాలని మస్క్ సూచిస్తారని, అయితే కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Twitter: మొదటి విడతలో 30% మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైన ట్విట్టర్‭

ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో కంపెనీ భవిష్యత్తు గురించి ఒక వారం అనిశ్చితి నెలకొని ఉన్నందున ఉద్యోగులను తొలగించడం, తాత్కాలికంగా దాని కార్యాలయాలను మూసివేయడం, సిబ్బంది యాక్సెస్‌ను నిరోధించడం వంటి వాటి గురించి ట్విట్టర్ శుక్రవారం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేయనుంది. సిబ్బంది కోతల గురించి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఉద్యోగులను అప్రమత్తం చేస్తామని సోషల్ మీడియా సంస్థ సిబ్బందికి గురువారం పంపిన ఇమెయిల్‌లో తెలిపింది.