Twitter: మొదటి విడతలో 30% మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైన ట్విట్టర్‭

2021 చివరి నాటికి ట్విట్టర్ 7,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. కాగా, తాజాగా ఇందులో సుమారు 2,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబరులో క్రితం న్యూయార్క్ దినపత్రిక సైతం ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. అయితే దాన్ని ట్విట్టర్ యాజమాన్యం ఖండించింది. తాజా వార్తలపై స్పందించాలని రాయిటర్స్ చేసిన విజ్ణప్తిపై ట్విట్టర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Twitter: మొదటి విడతలో 30% మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైన ట్విట్టర్‭

Twitter Plans To Lay Off 30% Of Workforce In Round 1 Of Job Cuts

Twitter: ట్విట్టర్‭ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి ఉద్యోగుల తొలగింపు. ట్విట్టర్ ఆఫీసులో అడుగు పెట్టిన రోజు సీఈవో సహా కొంత మంది ఉద్యోగులపై వేటు వేసిన మస్క్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్ వార్తా పత్రిక పేర్కొంది. మొదటి విడత కింద ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 30 శాతం మందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ న్యాయవాది అలెక్స్ స్పిరో సలహా మేరకు మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మస్క్ లీగల్ డిపార్ట్‭మెంట్ చూస్తున్నారు.

రెగ్యూలేటరీ ఫైలింగ్ ప్రకారం.. 2021 చివరి నాటికి ట్విట్టర్ 7,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. కాగా, తాజాగా ఇందులో సుమారు 2,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబరులో క్రితం న్యూయార్క్ దినపత్రిక సైతం ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. అయితే దాన్ని ట్విట్టర్ యాజమాన్యం ఖండించింది. తాజా వార్తలపై స్పందించాలని రాయిటర్స్ చేసిన విజ్ణప్తిపై ట్విట్టర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

Mallikarjun Kharge: రాజకీయాలు ఒద్దు, ఎవరినీ నిందించం.. గుజరాత్‭లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే