Sri Lanka Crisis: గొటబయ నివాసంలో రహస్య బంకర్.. అందులో నుంచే పారిపోయాడా!

అధ్యక్ష భవనం ముట్టడికి వేలాది మంది ఆందోళనకారులు తరలిరావడంతో పాటు భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది సూచనలతో గొటబయ అధ్యక్ష భవనంలోని బంకర్ గుండా పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ భవనంలో అత్యంత భద్రతా బంకర్ ను కనుగొన్నారు.

Sri Lanka

Sri Lanka Crisis: శ్రీలంకలో ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. వేలాది మంది ప్రజలు శనివారం ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే నివాసాన్ని ముట్టడించారు. భద్రతా బలగాలను నెట్టుకొని మరీ అధ్యక్షుడు నివాసంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. అప్పటికే గొటబయ అక్కడినుంచి పరారయ్యాడు. అయితే ఆయన ఎటు వెళ్లారనేది ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. ఆర్మీ అధికారులు ఆయన్ను సురక్షితంగా ఆర్మీ క్యాంపుకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన దేశం విడిచి వెళ్లాపోయారనే వార్తలు ఆ దేశ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. పోర్టు వద్దకు వెళ్లి అక్కడి నౌక ద్వారా ఆయన దేశం విడిచి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. నౌకలో నాలుగైదు షూట్ కేసులను కొందరు వ్యక్తులు తరలిస్తుండగా తీసిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ షూట్ కేసులు గొటబయ రాజపక్సేవి అని ప్రచారం జరుగుతుంది.

ఇదిలాఉంటే అధ్యక్ష భవనం ముట్టడికి వేలాది మంది ఆందోళనకారులు తరలిరావడంతో పాటు భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది సూచనలతో గొటబయ అధ్యక్ష భవనంలోని బంకర్ గుండా పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ భవనంలో అత్యంత భద్రతా బంకర్ ను కనుగొన్నారు. ప్యాలెస్‌లో ఉంచిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందం సభ్యులు అది బంకరేనని ధృవీకరించారు. భవనంలోని ఓ భాగంలో గదికి తలుపులు వేసి ఉంది. ఆ తలుపులు బలవంతంగా తెరిచిచూడగా.. భూగర్భంలోకి దారిని గుర్తించారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తప్పించుకోవడానికి బంకర్‌ను ఉపయోగించారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది.

 

ఇదిలాఉంటే . శనివారం కొలంబోలోని అధ్యక్ష భవనంపై వేలాది మంది నిరసనకారులు దాడి చేసి, ప్రెసిడెంట్, అతని కుటుంబానికి కేటాయించిన విలాసాలను ఆస్వాదించారు. ఆ వీడియోలు వైరల్ గా మారాయి. నిరసనకారులు స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడం, ప్రెసిడెన్షియల్ జిమ్‌లో వ్యాయామం చేయడం, ప్రెసిడెంట్ వంటగదిలోని ఆహారాన్ని తింటూ కనిపించారు.