కరోనావైరస్‌కు మందు ఆల్కహాల్ అని ఇంటింటికీ పంచుతున్న గవర్నర్

కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు సర్వత్రా లాక్‌డౌన్ విధించడంతో ప్రభుత్వం నిత్యవసరాలు సప్లై చేసి ప్రజల ఆకలి తీరుస్తుంది. భారతదేశంలో ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ.. ఆల్కహాల్ కు నో చెప్పేశారు. షాపులు కూడా తెరవొద్దని మద్యం అమ్మకాలు ఆపేయాలని ఆంక్షలు పెట్టారు. ఇదిలా ఉంటే మద్యం బాటిళ్లను ఇంటింటికీ పంచాలంటున్నాడు గవర్నర్. ఆల్కహాల్ గొంతుకు శానిటైజర్ లా పని చేస్తుందని నమ్మి ఆహారపదార్థాలతో పాటు దానిని కూడా పంపిస్తున్నాడు. 

కెన్యా రాజధాని నైరోబికి చెందిన గవర్నర్.. సొంత ఆలోచన ఇది. ప్రజల ఇళ్లలోనే ఉండాలి. ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదు. అని చెప్తుంటే ఆయన మాత్రం ఆల్కహాల్ నోవల్ కరోనా వైరస్ అడ్డుకుంటుందని, గొంతుకు శానిటైజర్లా పనిచేస్తుందని అంటున్నాడు. గత వారం మీడియాలోనూ దీనిపైన కథనాలు వచ్చాయి. కొవిడ్-19 ప్యాకేజీల్లో భాగంగా చిన్న చిన్న బాటిళ్లలో ఆల్కహాల్ పంచాలని ఆదేశాలు జారీ చేశారు. 

దీనిని అధికారికంగానే ప్రకటించారు. ‘మేం చిన్నచిన్న బాటిళ్లలో హెనెస్సీ(ఆల్కహాల్) ఫుడ్ ప్యాక్ తో పాటు కలిపి ఇస్తున్నాం. World Health Organisation (WHO)తో పాటు మరి కొన్ని ఆర్గనైజేషన్లు చేసిన సర్వేలో ఆల్కహాల్ కరోనా వైరస్ ను చంపడంలో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు’ అంటూ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉంటే అదే రోజు WHO ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. కరోనా వైరస్ నుంచి ఆల్కహాల్ కాపాడలేదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బయటపడే, బయటపడని జబ్బులతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. కొవిడ్ 19 కంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేయొచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్.. 22లక్షల 40వేల 191మందిపై వైరస్ ప్రభావం పడింది. ఏప్రిల్ 18వరకూ లక్షా 53వేల 822మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read | కరోనాని జయించాడు.. కానీ గుండెపోటుతో చనిపోయాడు