Sea Hourse
SeaHorse : ఈ భూమ్మీదే కాదు సముద్రంలో కూడా ఎన్నో జీవరాశులు అంతరించిపోతున్నాయి. దీనికి కారణం మానవుడే. జీవరాశుల తరువాత ఈ భూమ్మీద కొచ్చిన మనిషి జీవాల ఉసురు తీస్తున్నాడు.ఈ భూమి కేవలం మనిషికే కాదు సమస్త ప్రాణికోటికి జీవించే హక్కు ఉందనే సంగతి మనిషి మరచిపోతున్నాడు. పొల్యూషన్ కు కారణమవుతు ఎన్నో జీవరాశుల మనుగడకు ముప్పు తెస్తుననాడు. అలా ఇప్పటికే ఎన్నో రకాల జీవులు అంతరించిపోగా..అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్నవాటిని అరుదైనవి అంటున్నాం. అలా అంతరించిపోయాయనుకుంటున్న కొన్ని జీవులు తిరిగి కనిపిస్తే ఎంత సంతోషంగా ఉంటోంది కదా..అలా అంతరించిపోయిందని అనుకున్న ఓ చిన్న జీవి మనుగడలోనే ఉందని తెలిసింది. అదే ‘సీ హార్స్’.
కొంత కాలం క్రితం నుంచే సముద్రంలో నివశించే ఈ అరుదైన సీ హార్స్ జాతి జీవులు కనిపించలేదు. దీంతో అవి అంతరించిపోయాయని భావించారు. కానీ సీ హార్స్ లో అంతరించిపోలేదనీ..అవి మనుగడలోనే ఉన్నాయని డైవర్ల ద్వారా తెలిసింది. గ్రీస్‌లోని అయిటోలికో అనే నీటి పాయ 30 మీటర్ల లోతులో కొంతమంది డైవర్లకు ఈ సీ హార్స్ కనిపించాయి. ఆ నీటిపాయలో చాలావరకూ వ్యర్ధాలతో నిండిపోయి ఉంది. ఆ చెత్తలోనే సీహార్స్ నివశిస్తున్నాయని డైవర్ల ద్వారా తెలిసింది. సీహార్స్ లను తాము చూశామని డైవర్లు తెలపటంతో పర్యావరణవేత్తలు..సైంటిస్టులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
వెంటనే ఈ ఇరుకైన జలమార్గాలను శుభ్రం చేయకపోతే..సీహార్స్ లు పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే అవన్నీ కనీసం ఒకే ప్రాంతంలో ఉన్నాయని తాను భావిస్తున్నానని అన్నాడు. అయితే స్థానికంగా చేపలు పట్టే వారు మాత్రం అయిటోలికో నీటిపాయలో ఇంతకుముందు చాలా ఎక్కువగా నీటిగుర్రాలు ఉండేవని..కానీ ఇప్పుడు వాటి సంఖ్య చాలావరకూ తగ్గిపోయిందని చెబుతున్నారు.
కాగా యూకేలోని నైరుతిలో ప్లైమౌత్ తీరంలో a.k.a spiny seahorse ఫోటో తీయబడింది. సముద్రపు పచ్చికభూములు నిస్సార జలాల్లో కనిపించే రక్షిత సముద్ర జంతువులలో ఇది ఒకటి. లోతైన నీటిలో వాటిని వెతకాలంటే లైసెన్స్ ఉండాల్సిందేనట.
కాగా సీ హార్స్ జాతి చాలా విభిన్నమైనది. సాధారణంగా ఆడవే గర్భందాల్చి పిల్లలు కంటాయి. కానీ సీహార్స్ లు అలా కాదు. మగవే పిల్లల్ని కంటాయి. అందుకే వీటిని శిశుత్పాదక జంతువులు అంటారు. మొత్తం జంతు ప్రపంచంలో ఏ జీవికి లేని ప్రత్యేకత సీహార్స్ లకు ఉంది. అదే మగవే పిల్లల్ని కనటం. ఆడ సీహార్స్ గుడ్డుల్ని మగ సీహార్స్ పొట్టలో వదిలేస్తుంది. అప్పటినుంచి ఆ గుడ్లకు ఆక్సిజన్ అందించటం నుంచి పిల్లల్ని కనేవరకూ మగ సీహార్సే చూసుకుంటుంది. అలా గుడ్డుల్ని పిల్లలు కని నీటిలోకి విడుదల చేసే వరకూ మగ సీహార్స్ లైంగిక ప్రక్రియ జోలికే వెళ్లదు. అంతేకాదు..మగ సీహార్స్ తన మొదటి జీవిత భాగస్వామి తనకు తిరిగి దొరకకపోతే..మరొక ఆడ సీహార్స్ ను అంగీకరించదట. మనుషుల కంటే ఈ మగ సీహార్స్ ఎంత గొప్పవో కదా..అన్నట్లు ఈ సీహార్స్ తో పాటు అదే జాతికి చెందిన పైప్ షిఫ్, సీ డ్రాగన కూడా ఇదే విధంగా మగవే పిల్లల్ని కంటాయి.