Groom is glued to the phone : బాడీ ప్రెజెంట్.. మైండ్ ఆప్సంట్.. పెళ్లిలో ఫోన్‌కి అతుక్కుపోయిన వరుడు

సెల్ ఫోను ఉంటే చాలు ఇంక పక్కవాడితో పనిలేనట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇక జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాల్లో కూడా ఫోను విడిచిపెట్టని వారి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్లిలో కూడా ఫోనుకి అతుక్కుపోయిన పెళ్లికొడుకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Viral Video

Viral Video : ఎవరు ఎక్కడ ఉన్నా.. ఎంతమందిలో ఉన్నా.. ఫోన్‌కి అతుక్కుపోతున్నారు. పక్కన ఉన్నవారిని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఫోన్‌కి బాగా అడిక్ట్ అయ్యాడేమో ఓ పెళ్లికొడుకు తన పెళ్లి అన్న సంగతి కూడా మర్చిపోయి పెళ్లిలో ఫోన్‌కి అతుక్కుపోయాడు. అతని పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Elephant Angry: ఏనుగుకు కోపమొచ్చింది.. మావటివాడిని ఎత్తికుదేసిన ఏనుగు.. పరుగు పెట్టిన కొత్త జంట.. వీడియో వైరల్

Mahuntsu అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన పెళ్లి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి సమయంలో వరుడి ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పెళ్లికి సంబంధించిన ప్రమాణాలు చేసుకున్న జంట నడిచి వెళ్తుంటారు. వధువు అందర్నీ ప్రేమగా పలకరిస్తుంటుంది. అయితే వరుడు మాత్రం ఫోను చూసుకోవడంలో బిజీ బిజీగా కనిపించాడు. ‘నా శరీరం ఇక్కడ మీతో ఉంది, కానీ నా మనస్సు బయట ఎక్కడో ఉంది” అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

marriage breakup : విడిపోయిన కొత్త జంట.. పెళ్లికూతురు చేసిన పని తెలిస్తే షాకవుతారు

‘అతను చేసే పనికి ఆమె ఎందుకు బాధపడటం లేదో తెలుసుకోవాలని ఉంది’ అని ఒకరు.. ‘అతని ప్రవర్తన సరిగా లేదు.. పెళ్లిలో ఆమెను అవమానించడం.. ఆమెకు అర్ధం అవట్లేదు’ అని కామెంట్లు చేశారు. అతను ఫోనుని అతుక్కుపోయి ఉంటే వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించవచ్చని నెటిజన్లు నవ్వుకున్నారు.