Elephant Angry: ఏనుగుకు కోపమొచ్చింది.. మావటివాడిని ఎత్తికుదేసిన ఏనుగు.. పరుగు పెట్టిన కొత్త జంట.. వీడియో వైరల్

ఏనుగుకు కోపమొస్తే దానిని అదుపు చేయడం సాధ్యమయ్యే పనికాదు. వీరంగం సృష్టిస్తోంది.. అడ్డొచ్చిన వారిని తొండంతో పక్కకు నెట్టేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. అందుకే ఎనుగు ఎంత ప్రశాంతంగా ఉన్న దాని దగ్గరకు వెళ్లాంటే ఒంట్లో జంకు మొదలవుతుంది. ఇలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Elephant Angry: ఏనుగుకు కోపమొచ్చింది.. మావటివాడిని ఎత్తికుదేసిన ఏనుగు.. పరుగు పెట్టిన కొత్త జంట.. వీడియో వైరల్

Viral video

Elephant Angry: ఏనుగుకు కోపమొస్తే దానిని అదుపు చేయడం సాధ్యమయ్యే పనికాదు. వీరంగం సృష్టిస్తోంది.. అడ్డొచ్చిన వారిని తొండంతో పక్కకు నెట్టేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. అందుకే ఎనుగు ఎంత ప్రశాంతంగా ఉన్న దాని దగ్గరకు వెళ్లాంటే ఒంట్లో జంకు మొదలవుతుంది. ఇలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ ఏనుగు ఉన్నట్లుండి మావటిని తొండంతో ఎత్తి కుదేసింది. అక్కడే ఫొటో షూట్‌లో నిమగ్నమైన కొత్తజంట పరుగు లంకించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.

Viral Video: సైకిల్‌ తొక్కుతూ, విన్యాసాలు చేస్తూ దూసుకెళ్లిన వృద్ధుడు

కేరళ రాష్ట్రం గురువాయూర్‌లో ఓ కొత్తజంట ఫొటో షూట్‌కు సిద్ధమైంది. ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఫొటో షూట్‌లో వారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏనుగుకు దగ్గరగా నిలుచొని కొత్త జంట తమ ఫొటో షూట్‌లో నిమగ్నమయ్యారు. వెనుకాల ఏనుగుపై ఓ వ్యక్తి కూర్చొని ఉండగా, కింద మావటి దానిని అదుపుచేస్తున్నాడు. కొద్దిసేపు మంచిగానే ఉన్న ఏనుగు ఉన్నట్లుండి కోపాన్ని ప్రదర్శించింది. మావటిపై తొండంతో దాడిచేసింది. అతని చొక్కాను చించేసింది. బట్టలు ఊడిపోవటంతో బతుకుజీవుడా అంటూ మావటి ఏనుగు దాడినుండి తప్పించుకొని పరుగు లంకించుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Wedding Mojito (@weddingmojito)

అప్పటి వరకు అక్కడే ఫొటో షూట్ చేయించుకుంటున్న కొత్త జంట ఈ భయంకరమైన సన్నివేశాన్ని గమనించి అక్కడి నుంచి జారుకున్నారు. కొత్త జంట కుటుంబ సభ్యులు, బంధువులుసైతం అక్కడి నుంచి దూరంగా పరుగుపెట్టారు. కోపంతో రెచ్చిపోయిన ఏనుగు కొద్దిసేపటికి శాంతించింది. అయితే ఈ ఏనుగుదాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో అక్కడివారు ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరుడు గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన అనుభవాన్ని చెప్పాడు.. మేము ఫొటో షూట్‌కోసం ఫోజులిస్తున్నాం. అకస్మాత్తుగా.. అందరూ అరుస్తూ పరిగెత్తడం ప్రారంభించారు. ఆమె నా చేయి పట్టుకుని పరిగెత్తింది అని ఆ వ్యక్తి చెప్పాడు. గురువాయూర్ దేవాలయం హిందూ వివాహ ఆచారాలకు చాలా ప్రసిద్ధి.