Guinness World Record: పాలదంతాలతో గిన్నీస్ రికార్డు కొట్టేసిన పదేళ్ల బుడ్డోడు

కెనడాలోని ల్యూక్ బోల్టన్ చరిత్రలోనే ఎవ్వరికీ లేనంత పెద్ద పాలదంతం ఉన్నట్లు రికార్డులకెక్కింది..

Guinness World Record: పాలదంతం ఊడిందా.. ఏం చేస్తాం. ఆ చిన్ని పన్ను తీసుకుని ఆచారాలను బట్టి ఎక్కడో దాచి పెట్టడమో.. మరేదైనా ప్రత్యేక చోటులో పాతి పెట్టడమో చేస్తాం. కానీ, ఇంత పొడవున్న పన్నును కోల్పోయిన బుడ్డోడు ఖాళీగా ఉండలేదు. తన 2.6 సెంటీమీటర్ల పన్నుతో గిన్నీస్ బుక్ రికార్డులకెక్కాడు.

కెనడాలోని ల్యూక్ బోల్టన్ చరిత్రలోనే ఎవ్వరికీ లేనంత పెద్ద పాలదంతం ఉన్నట్లు రికార్డులకెక్కింది. అయితే ఈ పన్ను సహజంగా ఊడిపోలేదు. 2019లో తన సమస్యను చూపించి డెంటిస్ట్ చేతుల మీదుగా పన్ను పీకించుకున్నాడు.

ఆ తర్వాత దానిని భద్రపరిచి.. గిన్నీస్ వరల్డ్ రికార్డుల వారు వెరిఫై చేయడానికి ఉంచాడు. రీసెంట్ గా గిన్నీస్ బుక్ వాళ్లు దీనిని గమనించారు. అంతకంటే ముందు 10సంవత్సరాల వయస్సున్న కర్టిస్ బాడీ అనే బాలుడికి 2.4 సెంటిమీటర్ల పొడవు ఉండేదని ఇదే అత్యంత పొడవైన పాలదంతం అని తెలిపారు.

ఇలాంటిది ఎవరైనా నోటిలో ఉంటుందా అని అనుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుందని అతని తండ్రి క్రెగ్ బోల్టన్ అంటున్నాడు. పన్నును జాగ్రత్తపరిచిన తర్వాత ఆ ఫ్యామిలీ రికార్డు కౌంటింగ్ ఆర్గనైజేషన్ ను కన్సల్ట్ చేసింది. 12వారాల్లోగా దానిని వెరిఫై చేశారు.

ట్రెండింగ్ వార్తలు