Gun Fire In USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఎనిమిది మంది మృతి

మరణించిన వారందరూ ఒకే కటుంబానికి చెందిన వారని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ఉటా లెఫ్టినెంట్ గవర్నర్ డీడ్రే హెండర్సన్ ట్విటర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

Gun Fire In USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులుకూడా ఉన్నారు. ఉటా ప్రావిన్స్‌లో ఇనాక్ సిటీలోని ఓ ఇంట్లో రాత్రి సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఎనిమిది మంది మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

Gun Firing in US school : అమెరికాలోని స్కూల్‌లో 15 ఏళ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలికివెళ్లి పరిశీలించారు. అప్పటికే వీరంతా మృతిచెంది ఉన్నారు. అందరి శరీరాలపై బుల్లెట్లు దిగిన గుర్తులు ఉన్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కాల్పులకు కారకులు ఎవరనేది తెలియలేదు. పోలీసులు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

మరణించిన వారందరూ ఒకే కటుంబానికి చెందిన వారని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ఉటా లెఫ్టినెంట్ గవర్నర్ డీడ్రే హెండర్సన్ ట్విటర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు