Yahya Sinwar : హమాస్‌కు చావుదెబ్బ.. అధినేత యహ్యా సిన్వార్‌ హతం.. ఇజ్రాయెల్‌ వెల్లడి!

ఈ నెల 7న జరిగిన ఐడీఎఫ్ దాడుల్లో ప్రధాన సూత్రధారి సిన్వార్ మృతిచెందాడని ఇజ్రాయెల్ ధృవీకరించింది.

Hamas chief Yahya Sinwar killed in Gaza operation_ Israel

Yahya Sinwar : హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతమయ్యాడు. ఈ నెల 7న జరిగిన ఐడీఎఫ్ దాడుల్లో ప్రధాన సూత్రధారి సిన్వార్ మృతిచెందాడని ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రాథమిక డీఎన్ఏ పరీక్ష ప్రకారం సిన్వార్ మృతిచెందినట్టు ధృవీకరించారు. ఇప్పటివరకూ సిన్వార్ బతికే ఉన్నాడంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. తాజాగా సిన్వార్ మృతిపై ఐడీఎఫ్ స్పష్టత ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులకు ఇతడే సూత్రధారి. హమాస్‌ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్‌ వాసులను దారుణంగా హతమార్చారు. ఈ దాడుల వెనుక ఉన్న సిన్వార్‌ కోసం ఇజ్రాయెల్‌ వేట ప్రారంభించింది.

ఈరోజు (అక్టోబర్ 17న) తెల్లవారుజామున, గాజాలో జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను చంపినట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. ఉగ్రవాదులు దొరికిన భవనంలో బందీలుగా ఉన్న ఆనవాళ్లు లేవని కూడా ప్రకటన పేర్కొంది. “ఈ ప్రాంతంలో పనిచేస్తున్న బలగాలు జాగ్రత్తగా మిషన్ నిర్వహిస్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ యూదు రాజ్యానికి అతిపెద్ద శత్రువులలో ఒకడైన సిన్వార్‌ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ అధికారులు, మిలిటరీ ఇంజనీర్లు, నిఘా నిపుణులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ అతడి కోసం తీవ్రంగా గాలించి దాడులు నిర్వహించింది.

హమాస్ సైనిక కార్యకలాపాలకు సూత్రధారిగా సిన్వార్, ఆగస్టులో ఇస్మాయిల్ హనియేకు వారసుడిగా ఎంపికయ్యాడు. జూలై చివరలో టెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియాహ్‌ను ఇజ్రాయెల్ సైన్యం తొలగించింది. 1962లో జన్మించిన సిన్వార్‌ను హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ నియమించారు. అల్ మజ్ద్ అనే అంతర్గత భద్రతా విభాగానికి చీఫ్‌గా నియమించారు. ఇస్లామిక్ నైతిక చట్టాలను ఉల్లంఘించినట్లు లేదా ఇజ్రాయెల్ దళాలకు సహకరించినట్లు అనుమానించిన వారిని చంపేస్తుంటాడు. ఇజ్రాయెల్‌కు సహకరించినందుకు నలుగురు పాలస్తీనియన్లను చంపి 1988లో జైలు పాలయ్యాడు. ఇజ్రాయెల్ జైలులో రెండు దశాబ్దాలకు పైగా గడిపాడు. అక్కడే అతను హిబ్రూ నేర్చుకున్నాడు. 2011లో ఖైదీల మార్పిడిలో విడుదలయ్యాడు.

గత నెలలో గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేయగా యహ్యా సిన్వార్‌ మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇజ్రాయెల్‌ మిలటరీ కూడా కీలక ప్రకటన చేసింది. తమ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారని పేర్కొంది. అయితే వారిలో సిన్వార్ ఉన్నాడా? లేదా అనేదానిపై ఇజ్రాయెల్‌ నిఘావర్గాలు ఆరా తీశాయి. చివరికి సిన్వార్ హతమయ్యాడనే విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది.

సిన్వార్‌ ఎవరంటే..? :
యాహ్యా పూర్తి పేరు ‘యహ్యా ఇబ్రహీం హస్సన్‌ సిన్వార్’. 1962 సంవత్సరంలో గాజాలోని ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1948 వరకు ప్రస్తుత దక్షిణ ఇజ్రాయెల్‌ అష్కెలోన్‌లోనే అతడి పూర్వీకులు నివసించేవారు. ఇది అప్పట్లో ఈజిప్ట్‌ ఆధీనంలో ఉంది. క్రమేపి సిన్వార్ ఫ్యామిలీ మొత్తం గాజాకు వలస వెళ్లింది. అక్కడే గాజా యూనివర్శిటీ నుంచి అరబిక్‌ స్టడీస్‌లో సిన్వార్ డిగ్రీ పట్టా పొందాడు. 2 దశాబ్దాల పాటు జైల్లోనే ఉన్నాడు. 1982లో తాను చేసిన నేరాలకు అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలయ్యాడు.

మజ్ద్‌ పేరిట ఒక సంస్థను కూడా స్థాపించాడు. అదే హమాస్‌‌గా మారింది. 1988లో సిన్వార్ అరెస్ట్‌ కాగా,, 1989లో అతడికి జీవిత ఖైదు పడింది. అనంతరం అనేకసార్లు జైలు నుంచి తప్పించుకోనేందుకు విఫలయత్నం చేశాడు. 2006లో హమాస్ ఎత్తుకెళ్లిన గిలియద్‌ షలిట్‌ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్‌ 1,026 మందిని విడుదల చేసింది. ఇందులో సిన్వార్ ఒకడు. ఆ తర్వాత హమాస్ మిలిటరీ విభాగంలో కీలకంగా వ్యవహరించాడు. 2015లో అమెరికా విదేశాంగశాఖ సిన్వార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

Read Also : Fox News Poll Survey : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సర్వే.. జాతీయ స్థాయిలో కమలా హారిస్ కన్నా 2 పాయింట్లతో ట్రంప్ ముందంజ..!