China : భారీ పర్వతంపై పర్వతారోహకుల కోసం స్నాక్స్ స్టోర్ .. చూస్తే షాకవుతారు

చైనాలో కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఓ భారీ పర్వతంపై పర్వతారోహకుల కోసం నిర్మించిన స్టాక్స్ స్టోర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు అక్కడికి ఎవరు వెళ్తారు? దానిని ఎవరు నిర్వహిస్తారు? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

China

China : అక్కడ భారీ పర్వతాలు ఎక్కుతున్నప్పుడు ఆకలి వేసిందా? బాగా అలసిపోయారా? నో టెన్షన్. పర్వతంపై వేలాడుతూ ఓ స్టోర్ ఉంటుంది. అక్కడ ఆకలి తీర్చుకోవచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. వామ్మో.. అదెక్కడ? ఆ నిర్మాణం ఎలా జరిగింది?

One Day Marriage In China : చైనాలో ఒక్కరోజు ‘వధువు’కు పెరుగుతున్న డిమాండ్ .. ఒక్కరోజు ‘పెళ్లి’వెనుక చైనీయుల వింత నమ్మకం

చైనాలో ప్రకృతి అద్భుతాలతో పాటు మానవ నిర్మిత భవనాలు అబ్బుర పరుస్తాయి. అవి అక్కడి ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడతాయి. అక్కడి ఓ భారీ పర్వతంపై వేలాడుతూ కనిపించే స్టాక్స్ స్టోర్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. చిన్న చెక్క పెట్టెలా కనిపిస్తున్న ఆ స్టోర్ సకల సౌకర్యాలతో నిర్మించారట. ఆ స్టోర్ పర్వతారోహకులకు రిఫ్రెష్‌మెంట్ ఇస్తోంది. ప్రావిన్స్ పింగ్‌జియాంగ్ కౌంటీలోని షినియుజై నేషనల్ జియోలాజికల్ పార్క్‌లో పర్వతంపై ఈ స్టోర్‌ను 2018 లో ప్రారంభించారు. ఇక్కడ పనిచేసేవారు జిప్ లైన్‌లను ఉపయోగించి షాపు తెరుస్తారట. ఇంటర్నెట్‌లో ఈ స్టోర్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టోర్ ఎలా పనిచేస్తుంది? దానిని ఎవరు నిర్వహిస్తారు? తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి కనపరిచారు.

International Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?

ప్రొఫెషనల్ రాక్ క్లైంబర్స్‌కి మాత్రమే ఈ స్టోర్‌లో ఉద్యోగం ఇస్తారట. వారు అమ్మే వస్తువులు అన్నీ ప్రత్యేక రోప్ కన్వేయర్ ద్వారా స్టోర్‌కి చేరవేస్తారట. ఆ స్టోర్‌లో ఒకరు మాత్రమే పట్టే స్పేస్ ఉంటుందట. @gunsnrosesgirl3 అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేర్ చేయబడిన ఫోటోలు చూసి ‘ఇక్కడ షాపింగ్ చేయాలంటే భయం వేస్తుందని’.. ‘ఇది చాలా వింతగాను.. నమ్మశక్యంగానూ లేదని’ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.