One Day Marriage In China : చైనాలో ఒక్కరోజు ‘వధువు’కు పెరుగుతున్న డిమాండ్ .. ఒక్కరోజు ‘పెళ్లి’వెనుక చైనీయుల వింత నమ్మకం

చైనాలో వింత వింత నమ్మకాలు..వింత వింత పెళ్లిళ్లకు దారి తీస్తున్నాయి. దీంతో దేశంలో ఒక్కరోజు ‘వధువు’కు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కరోజు ‘పెళ్లి’వెనుక చైనీయుల వింత నమ్మకం గురించి తెలిస్తే షాక్ అవుతాం.

One Day Marriage In China : చైనాలో ఒక్కరోజు ‘వధువు’కు పెరుగుతున్న డిమాండ్ .. ఒక్కరోజు ‘పెళ్లి’వెనుక చైనీయుల వింత నమ్మకం

China  One Day Marriage

China  One Day Marriage : చైనా జనాభా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. జనాభా నియంత్రణకు ఒకప్పుడు చైనా తీసుకున్న సింగిల్ బిడ్డ నిర్భంధం జనాభా సంక్షోభానికి దారి తీసింది. దీంతో ప్రభుత్వం ఇద్దరు..ముగ్గురు బిడ్డలను కనాలని ప్రకటించింది. కానీ ఎటువంటి ఫలితాలు కనిపించటంలేదు. దీనికి కారణం వివాహం అయినవారు ఇద్దరు ముగ్గురు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించటంలేదు. కారణం ఖర్చులు. అలాగే యువకులు పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపించటంలేదు. దీని కారణం కూడా జీవనశైలిలో పెరుగుతున్న ఖర్చులు. వాటిని భరించలేకే యువత పెళ్లిళ్లు చేసుకోవటానికి ముందుకు రావటంలేదు. ప్రభుత్వం వివాహాలు చేసుకోవటానికి..పిల్లల్ని కనటానికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నా జనాల్లో మాత్రం మార్పు రావటంలేదు. దీంతో చైనాలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. బ్రహ్మచారుల చైనాగా మారిపోతోంది.

కానీ గత కొంతకాలంగా చైనాలో ఇబ్బడి ముబ్బడిగా వివాహాలు తెగ జరిగిపోతున్నాయి. దీని వెనుక చైనీయులకు ఉన్న ఓ వింత నమ్మకమే కారణం. పెళ్లి చేసుకుంటే ఖర్చులు పెరుగుతాయని..పిల్లలు పుడితే ఆఖర్చులు ఇంకా పెరుగుతాయని భయపడే యువత కాస్తా ఇటీవల వివాహాలు చేసేసుకుంటున్నారు. అదీ కూడా ‘ఒక్కరోజు పెళ్లి’ కాన్సెప్ట్ తో.. అలా ‘ఒక్కరోజు వధువు’ పెళ్లిళ్లులు జరుగుతున్నాయట చైనాలో..ఈ ఒక్కరోజు వధువుకు డిమాండ్ బాగా పెరిగిందట..ఈ ఒక్కరోజు పెళ్లేంటీ..?ఒక్కరోజు వధువు ఏంటీ..అంటే..

Sacred Waist Thread For Men : మగవాళ్లకు మొలతాడుకు సంబంధమేంటీ..? భారతీయ సంప్రదాయం వెనుక సైన్స్

కానీ చైనీయులకు చాలా విషయాల్లో నమ్మకాలు బాగా ఎక్కువ. దీంట్లో భాగమే వివాహాలు కాకుండా చనిపోతే అశుభంగా అరిష్టంగా భావిస్తారు. దీంతో పెళ్లి అంటేనే ఆమడదూరం పారిపోయే చైనా యువతి ‘ఒక్కరోజు పెళ్లి’కి మొగ్గుచూపుతున్నారు. చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా ‍పరిగణిస్తారు. దీంతో చైనా యువకులు ఒకరోజు పెళ్లికి ఓకే అంటున్నారు. అలా ఒక్కరోజు పెళ్లి చేసుకుని బ్రహ్మచర్యం వదిలించుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. అలా చేయకపోతే వారికి పుట్టగతులు ఉండవని..నరకానికి వెళతారని, ప్రేతాత్మలు అవుతారని నమ్ముతారు.

పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. అలా వెళ్లే వధువుకు వరుడు కొంత డబ్బు ఇవ్వాలి. ఆ తరువాత ఆమెకు అతనికి ఎటువంటి సంబంధం ఉండదు. అలా ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరీట భారీ వ్యాపారం జరుగుతోంది.

ఇది చైనా ఆర్థిక అవసాలు ఉండే మహిళలు ఒక్కరోజు వధువులుగా మారి డబ్బులు సంపాదిస్తున్నారు. వివాహం అయిన మహిళలు కూడా ఇలా ఒక్క రోజు వధువుగా వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. అలా ఒక్కరోజు వధువుగా వెళ్లిన టియాన్ అనే ఓ వివాహిత మాట్లాడుతు..రోజువారి ఖర్చులు చాలా బాగా పెరిగిపోయాయని నా భర్త, ఒక్క కొడుకును పోషించుకోవటానికి తాను ఇలా మారాల్సి వచ్చిందని తెలిపింది.తాను మసాజ్ పార్లర్ నడుపుతున్నానని కానీ ఆ డబ్బు కుటుంబ అవసరాలకు సరిపోవటంలేదని అందుకే అదనపు ఆదాయం కోసం ఒక్కరోజు వధువుగా మారానని తెలిపింది. ఇటువంటి వివాహాలు చైనా రూరల్ ఏరియాల్లో బాగా పెరుగుతున్నాయి.

woman Birth Child On Beach : బీచ్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిక, 6437 కి.మీటర్లు ప్రయాణించి మరీ కల నెరవేర్చుకుంది..కానీ

పెళ్లి కాకుండా చనిపోతే అరిష్టం అనే నమ్మకమే చైనా యువతను ఇలా ఒక్కరోజు పెళ్లికి సిద్ధమయ్యేలా చేస్తోంది. వారు అనుకున్నట్లుగా ఒక్కరోజు పెళ్లితో వారి బ్రహ్మచర్యం వదిలిపోతుంది. పెళ్లి కాకుండా చనిపోకుండా ఉన్నట్లు అవుతుంది. సో..ఇక అరిష్టం అనే కాన్సెప్టే లేదంటున్నారు ఈ ఒక్కరోజు పెళ్లితో..చైనాలో ఇదో పెద్ద వ్యాపారంగా మారిపోయిందట..