Hezbollah Tunnel: భారీ సొరంగం.. హమాస్‌ను మించి హెజ్‌బొల్లా సొరంగాలు.. లోపల సకల సౌకర్యాలు.. వీడియో వైరల్

లెబనాన్ లో హెజ్‌బొల్లా వాడే సొరంగం ఒకదానిని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Hezbollah Tunnel

Israel-Hamas War: లెబనాన్ లో హెజ్‌బొల్లా వాడే సొరంగం ఒకదానిని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. గాజా భూగర్భంలోని హమాస్ సొరంగాల కంటే కొన్ని రెట్లు పెద్దవిగా హెజ్‌బొల్లా సొరంగాలు ఉన్నాయి. ఈ వీడియోలో.. భారీ సొరంగంలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ లు, ద్విచక్ర వాహనాలు కూడా ఈ సొరంగాల్లో తిరిగేలా ఉన్నాయి. హెజ్‌బొల్లా రద్వాన్ ఫోర్స్ కమాండోలు అక్కడే ఉండేవారని ఇజ్రాయెల్ ఈ వీడియోలో తెలిపింది. వీటి ప్రవేశ మార్గాలు, బయటకు వచ్చే మార్గాలు పౌరుల నివాసాల్లో ఉంటాయని వీడియోలో ఇజ్రాయెల్ పేర్కొంది.

Also Read: Air Canada Flight : కెనడా విమానంలో అల్లకల్లోలం.. క్యాబిన్‌లో ఎగిరిపడ్డ ప్రయాణికుల ఆహారం.. ఫొటోలు వైరల్!

హెజ్‌బొల్లా సొరంగాల్లో ప్రత్యేక గదులు, ఏకే 47 రైపిల్స్, బెడ్ రూం, బాత్ రూంలు, స్టోరేజ్ గదులు, జనరేటర్లు కూడా ఉన్నాయి. మంగళవారం తమ దళాలు ఈ సొరంగాన్ని గుర్తించడం జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు గాజాలోకూడా హమాస్ పై దాడులను ఇజ్రాయెల్ కొనసాగించింది. ఈ దాడుల్లో హమాస్ డ్రోన్ ఆపరేషన్స్ అధిపతి మహమూద్ అల్ మహబూబ్ ను మట్టుబెట్టింది. ఐడీఎఫ్ కు చెందిన 162వ డివిజన్ దళాలు మహమూద్ అల్ మహబూబ్ ను మట్టుబెట్టాయి.