మతమార్పిడి కోసం : పాక్ లో హిందూ బాలికల కిడ్నాప్ 

  • Publish Date - March 24, 2019 / 03:55 AM IST

లాహోర్: పాక్ లో నివసిస్తున్న హిందువులపై పాక్ తన ప్రతాపాన్ని చూపుతోంది. హిందువులపై మత ఛాందసాన్ని రుద్దుతోంది. హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడుతోంది. కిడ్నాప్ చేసిన బాలికలకు బలవంతంగా నిఖా చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లను కిడ్నాప్‌ చేయడంతోపాటు..బలవంతంగా మత మార్పిడి చేయించి, వారికి వివాహాలు జరిపించిన ఘటన వెలుగులోకొచ్చింది. హోలీ వేడుకల సందర్భంగా రవీనా అనే 13 బాలిక..రీనా అనే మరో 15 బాలికలను మతఛాందసవాదులు కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కు వెలుగులోకొచ్చాయి. దాంట్లో వారిద్దిరికీ నిఖా చేసినట్లుగా కూడా ఉంది. కాగా..మరో వీడియోలో ఆ బాలికలు తాము ఇస్లాం మతాన్ని ఇష్టపూర్వకంగానే  స్వీకరిస్తున్నట్టు..తమను ఎవరూ బలవంతం చేయలేదని తెలిపినట్లుగా ఉంది. కానీ ఆ బాలికలను భయపెట్టి అలా చెప్పించారే వాదనలు ఉన్నాయి. ఈ ఘటనపై పాక్‌లోని హిందూ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. దీనికి సంబంధించినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి