మైనారిటీల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం బంగ్లాదేశ్‌లోని సనాతన్ జాగరణ్ మంచ్.. చిట్టగాంగ్‌లోని చారిత్రాత్మక లాల్దిఘి మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం నుంచి తమకు ఈ హామీ కావాలంటూ వేలాది మంది హిందువులు కలిసి ఈ ర్యాలీ నిర్వహించారు.
ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని గవర్నమెంట్ తమ ఎనిమిది డిమాండ్లను నెరవేర్చేవరకు నిరసనను విరమించబోమని హిందువులు స్పష్టం చేశారు. మైనారిటీలపై నేరాలకు పాల్పడే వారిపై సత్వర విచారణకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తగిన పరిహారం ఇచ్చి, వారికి పునరావాసం కల్పించాలన్నారు. వెంటనే మైనారిటీ రక్షణ చట్టం తేవాలని అన్నారు.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, విద్యా సంస్థలు, హాస్టళ్లలో మైనారిటీల కోసం ప్రార్థనా స్థలాలను ఇవ్వాలని చెప్పారు. హిందూ బౌద్ధ, క్రైస్తవ సంక్షేమ ట్రస్టులకు తోడ్పడాలని డిమాండ్ చేశారు. ప్రాపర్టీ రికవరీ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎంట్రస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ ను సక్రమంగా అమలు చేయాలని అన్నారు. హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత హిందూ సంస్థలు చేసిన అతి పెద్ద ర్యాలీ ఇదే.
In #Bangladesh, the Sanatan Jagaran Mancha held a large rally in Chattogram on Friday, advocating for the rights and safety of minorities. #HindusarenotsafeinBangladesh pic.twitter.com/opXFbKDr7H
— Win Today 🇮🇳 (@ashok0220) October 26, 2024
ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా? అంటూ జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్.. కంటతడి