Honduras First Woman President Xiomara : హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా క్యాస్ట్రో రికార్డు

సెంట్రల్‌ అమెరికా దేశమైన హోండూరస్‌ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా క్యాస్ట్రో రికార్డు సృష్టించారు.

Honduras First Woman President Xiomara Castro

Honduras First Woman President Xiomara Castro : వామపక్ష ప్రతిపక్ష అభ్యర్థి జియోమారా కాస్ట్రో హోండురాస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సెంట్రల్‌ అమెరికా దేశమైన హోండూరస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్‌ పార్టీ ఓటమిని అంగీకరించింది. మంగళవారం (డిసెంబర్ 1,2021) జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష లిబర్టీ అండ్‌ రీఫౌండేషన్‌ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా వామపక్ష ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్నీ సిద్ధమయ్యాయి.

Read more : Barbados Republic : బ్రిటీష్ పాలన నుంచి విముక్తి.. 400 ఏళ్ల త‌ర్వాత‌ గ‌ణ‌తంత్ర దేశంగా బార్బ‌డోస్‌ 

హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా క్యాస్ట్రో సరికొత్త రికార్డు సృష్టించారు. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. మంగళవారం వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించారు. అలాగే అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది. హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా ఎన్నికయ్యారు.

కాగా..అప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న నేషనల్ పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురా అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు షియోమరాను అభినందించారు. క్యాస్ట్రో కుటుంబాన్ని వ్యక్తిగతంలో కలిసి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా నాజ్రీ అస్ఫురా మాట్లాడుతు..మేయర్ నస్రీ అస్ఫురా మాట్లాడుతూ..“ షియోమరా విజయానికి నేను ఆమెను అభినందిస్తున్నాను. అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు..దేవుడు ఆమెను ఆశీర్వదించాలని..పాలనకు కావాల్సిన మార్గనిర్దేశం చేస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. ఆమె పాలనలో హోండురాన్‌ అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కోరుకుంటున్నానన్నారు.

Read more :  Sweden PM : ఓటింగ్ లో ఓడినా..స్వీడన్ తొలి మహిళా ప్రధాని నియామకానికి పార్లమెంట్ ఆమోదం

హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన షియోమరా క్యాస్ట్రోను అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తన ట్విటర్‌ ద్వారా అభినందించారు.”స్వేచ్ఛ..నిష్పక్షపాతంగా ఎన్నికలలో ఓటు వేయడానికి హోండురాన్ ప్రజలు తమ శక్తిని వినియోగించుకున్నారని..ప్రజలను అధ్యక్షురాలిగా ఎన్నికైన @XiomaraCastroZ ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, అవినీతికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని కోరుకంటున్నామని..తెలిపారు.

హోండురాస్ అమెరికా లోని ఒక గణతంత్ర రాజ్యం. దీనిని పూర్వం బ్రిటీష్ హోండురాస్ (ఇప్పటి బెలీస్) నుండి భేదం సూచించటానికి స్పానిష్ హోండురాస్ అని పిలిచేవారు. దీనికి పశ్చిమంలో గౌతమాలా, నైరుతిలో ఎల్ సాల్వడోర్, ఆగ్నేయంలో నికరాగ్వా, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఫోన్సెకా వద్ద పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన కరీబియన్ సముద్రానికి అతిపెద్ద ప్రవేశ మార్గంగా గల్ఫ్ ఆఫ్ హోండురాస్‌లను సరిహద్దులుగా కలిగి ఉంది. హోండురాస్ రాజధాని Tegucigalpa. అధికారిక భాష స్పానిష్.