Sweden PM : ఓటింగ్ లో ఓడినా..స్వీడన్ తొలి మహిళా ప్రధాని నియామకానికి పార్లమెంట్ ఆమోదం

స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలీనా ఆండర్సన్‌(54)ను నియమించేందుకు ఆ దేశ పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా ఈ నెల 4న సోషల్ డెమొక్రటిక్

Sweden PM : ఓటింగ్ లో ఓడినా..స్వీడన్ తొలి మహిళా ప్రధాని నియామకానికి పార్లమెంట్ ఆమోదం

Sweden

Sweden PM  స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలీనా ఆండర్సన్‌(54)ను నియమించేందుకు ఆ దేశ పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా ఈ నెల 4న సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులను వదులుకున్న స్టెఫాన్ లోఫ్‌వెన్ స్థానంలో ఆమెను ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం స్వీడన్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి పదవి ఎంపికకి జరిగిన ఓటింగ్‌లో మగ్దలీనా ఆండర్సన్‌ ఓడిపోయినప్పటికీ స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. స్వీడన్ పార్లమెంటులో 349 మంది సభ్యులు ఉన్నారు. బుధవారం జరిగిన ఓటింగ్ లో మగ్దలీనా ఆండర్సన్‌ కు అనుకూలంగా 117 ఓట్లు లభించాయి. ఆమెకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేశారు. 57 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒకరు గైర్హాజరయ్యారు.

అయితే స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం కనీసం 175 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉంటేనే ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగవలసి ఉంటుంది. ప్రస్తుతం మగ్దలీనాకు వ్యతిరేకంగా 174 మంది మాత్రమే ఓటు వేసినందువల్ల ఆమెను ప్రధాన మంత్రి పదవిలో నియమించేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అంటే ఒక్క ఓటు తేడాతో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు.

కాగా, స్త్రీ, పురుష సమానత్వం విషయంలో ప్రగతిపథంలో ఉన్న యూరోపు దేశాల్లో స్వీడన్ ఒకటని చెబుతారు. అటువంటి దేశానికి ప్రధానిగా ఓ మహిళ ఎన్నికవడం ఇదే తొలిసారి. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ, గ్రీన్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని మగ్దలీనా శుక్రవారం(నవంబర్-26) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీ, సెంటర్ పార్టీల మద్దతును కూడా ఆమె కోరే అవకాశం కనిపిస్తోంది.

కాగా, 2022 లో స్వీడన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గత ఏడేళ్లుగా స్వీడన్ ప్రధానిగా ఉన్న స్టెఫాన్ లోఫ్‌వెన్.. తన తదనంతరం కాబోయే ప్రధానికి ఎన్నికల సన్నద్ధత కోసం తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో స్వీడన్ ప్రధాని పదవికి ఈ నెల 10 న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నవంబర్ 11న పార్లమెంట్ స్పీకర్ అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపిన అనంతరం అండర్సన్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారు. ఆమెకు ఒక వారం సమయం ఇచ్చింది పార్లమెంట్. ప్రధానమంత్రి పదవికి జరిగే ఓటింగ్ లో మద్దతు కోసం లెఫ్ట్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అండర్సన్ కటించారు. సెంటర్ పార్టీ గతంలో ఆమెకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించడంతో, తాజాగా జరిగిన ఓటింగ్ లో ఆమెకు అనుకూలమైన రీతిలో ఓట్లు రానప్పటికీ..వ్యతిరేకమైన ఓట్లు ఎక్కువ రాకపోవడంతో స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు.

అండర్సన్‌కు మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ సభ్యురాలు అమినే కకబవె పార్లమెంటులో మాట్లాడుతూ..” స్కాండినేవియన్ దేశాల్లో సార్వత్రిక ఎన్నికల్లో స్త్రీపురుషులకు సమాన ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా స్వీడన్ వేడుకలు జరుపుకొంటోందని, అయినా ఇప్పటివరకు మహిళలు ఎవరూ ఉన్నత పదవుల్లోకి ఎంపిక కాలేదని, అందువల్ల ఇప్పుడీ నిర్ణయంలో ఏదో ప్రత్యేకత ఉందని” అన్నారు.

ప్రధానిగా ఎన్నికైన అండర్సన్ మాట్లాడుతూ.. “తాను మహిళా ప్రధానిగా ఎన్నికయ్యానంటే మన దేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఉందో దీనిబట్టి తెలుస్తుందని” పేర్కొన్నారు. కాగా, స్టెఫాన్ లోఫ్‌వెన్ ప్రభుత్వం తనను తాను ‘‘ఫెమినిస్ట్’’గా చెప్పుకునేది.

ALSO READ Mamata Meets PM Modi : మోదీతో దీదీ భేటీ..యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కి మద్దతు