Hero Glamour X125 : కొత్త హీరో గ్లామర్ X125 బైక్ భలే ఉంది భయ్యా.. ఫీచర్ల కోసమైన ఈ బైక్ ఇంటికి తెచ్చుకోవచ్చు!

Hero Glamour X 125 : కొత్త హీరో గ్లామర్ బైక్ చూశారా? క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్స్, టీఎఫ్‌టీ కన్సోల్ వంటి ఫీచర్లతో వచ్చింది.

Hero Glamour X125 : కొత్త హీరో గ్లామర్ X125 బైక్ భలే ఉంది భయ్యా.. ఫీచర్ల కోసమైన ఈ బైక్ ఇంటికి తెచ్చుకోవచ్చు!

Hero Glamour X 125

Updated On : August 20, 2025 / 8:10 PM IST

Hero Glamour X125 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త బైక్ వచ్చేసింది. కంపెనీ కొత్త హీరో గ్లామర్ X125 లాంచ్ చేసింది. ఈ బైక్ (Hero Glamour X 125) ప్రారంభ ధర రూ. 90వేలు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది.

ఈ బైకులో స్పెషాలిటీ ఏమిటంటే.. ఈసారి హీరో ఈ గ్లామర్ బైక్‌లో ఖరీదైన బైక్‌లలో కనిపించే ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ హీరో గ్లామర్ బైక్ లాంచ్ అయిన వెంటనే చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

డిజైన్, లుక్ :
కొత్త హీరో గ్లామర్ X 125 డిజైన్ గతంలో కన్నా ఎంతో ఆకర్షణీయంగా స్పోర్టిగా ఉంటుంది. బాడీ ప్యానెల్స్‌కు ఈజీ టచ్ అందిస్తుంది. కొత్త ఫీచర్లతో బైక్‌కు మరింత క్రేజ్ తీసుకొస్తాయి. ఈ గ్లామర్ బైకును కంపెనీ మాట్టే మాగ్నెటిక్ సిల్వర్, కాండీ బ్లేజింగ్ రెడ్, మెటాలిక్ నెక్సస్ బ్లూ, బ్లాక్ టీల్ బ్లూ బ్లాక్ పెర్ల్ రెడ్ అనే 5 కలర్ ఆప్షన్లలో ఆఫర్ చేస్తోంది.

Hero Glamour X125 : ఇంజిన్, పర్ఫార్మెన్స్ :

ఈ కొత్త బైక్ 124.7cc ఇంజిన్‌ కలిగి ఉంది. 8,250rpm వద్ద 11.4bhp పవర్, 6,500rpm వద్ద 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఈజీగా రైడ్-బై-వైర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ కేటగిరీలో ఇలాంటి మోడల్ ఇదే ఫస్ట్ టైమ్.

Read Also : Samsung Galaxy S26 Series : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా 3 ఫోన్లు.. ధర ఎంత? లాంచ్ ఎప్పుడంటే?

సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు :

ఈసారి హీరో గ్లామర్ X 125 బైకులో 125cc బైక్‌లలో లేని అనేక ఫీచర్లను చేర్చింది. అతిపెద్ద హైలైట్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. టోగుల్ స్విచ్‌తో ఈజీగా యాక్టివేట్ చేయవచ్చు. ఈ బైక్‌లో ఎకో, రోడ్, పవర్ అనే 3 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ మోడ్‌లు ఇంజిన్ మ్యాపింగ్, పవర్ డెలివరీని వేగంగా మారుస్తాయి. రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్లు :
ఈ బైక్ కొత్త కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. బ్లూటూత్‌కు సపోర్టు అందిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లతో గ్లామర్ బైక్ ఇప్పుడు కమ్యూటర్ సెగ్మెంట్‌లో పోటీ పడటమే కాకుండా ప్రీమియం లుక్, ఫీల్‌ను కూడా అందిస్తుంది.

ధర, లభ్యత :
కొత్త గ్లామర్ X 125 బైక్ ధర రూ. 90వేల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. లక్ష (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో బుకింగ్ ప్రారంభించింది.