Samsung Galaxy S26 Series : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చేస్తోంది.. ఏకంగా 3 ఫోన్లు.. ధర ఎంత? లాంచ్ ఎప్పుడంటే?
Samsung Galaxy S26 Series : కొత్త శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్రో, గెలాక్సీ S26 ఎడ్జ్ 3 ఫోన్లు లాంచ్ రాబోతున్నాయి.

Samsung Galaxy S26 Series
Samsung Galaxy S26 Series : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి శాంసంగ్ నుంచి కొత్త సిరీస్ ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ (Samsung Galaxy S26 Series) లాంచ్ కోసం రెడీ అవుతోంది. 2026 ప్రారంభంలో ఈ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
స్టాండర్డ్, ప్లస్ వేరియంట్‌లతో పాటు మొత్తం 3 మోడళ్లలో రానుంది. శాంసంగ్ గెలాక్సీ S26 ప్రో, గెలాక్సీ S26 ఎడ్జ్, S26 అల్ట్రా ఫోన్లు ఉండనున్నాయి. రాబోయే శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Galaxy S26 Series : డిజైన్, డిస్‌ప్లే (అంచనా) :
GSMA లిస్టు ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 ప్రో ఫోన్ 6.27-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 ఎడ్జ్ ఫోన్ 6.66 అంగుళాల వరకు పెంచవచ్చు. అయితే, అల్ట్రా సూపర్-స్లిమ్ బెజెల్స్‌తో 6.9-అంగుళాల భారీ స్క్రీన్ కలిగి ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 ఎడ్జ్ 5.5mm వద్ద సన్నగా ఉండవచ్చు. గెలాక్సీ S25 ఎడ్జ్ 5.8mm ఫ్రేమ్ కన్నా సన్నగా ఉండవచ్చు. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 7.xmm పరిమాణంలో ఉండే అవకాశం ఉంది.
Read Also : Realme P4 5G Series : కొత్త రియల్‌మి P4 5G సిరీస్ ఆగయా.. ఒకటి కాదు రెండు ఫోన్లు.. ధర, ఆఫర్లు వివరాలివే!
బ్యాటరీ, పర్ఫార్మెన్స్ (అంచనా) :
గెలాక్సీ క్లబ్ రిపోర్టు ప్రకారం.. శాంసంగ్ S26 ప్రో 4300mAh బ్యాటరీతో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎడ్జ్ 4200mAh యూనిట్ కలిగి ఉంటుంది. అయితే, శాంసంగ్ అల్ట్రా 5000mAh బ్యాటరీతో పాటు 60W ఛార్జింగ్‌తో వస్తుందని అంచనా. హుడ్ కింద ఈ శాంసంగ్ 3 ఫోన్లు LPDDR5X ర్యామ్, స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్ కలిగి ఉండొచ్చు.
కెమెరా అప్‌గ్రేడ్స్ (అంచనా) :
కెమెరాల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఉండనుంది. లీక్‌ల ప్రకారం.. శాంసంగ్ ఇన్-హౌస్ ISOCELL సెన్సార్, 200MP సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 12MP టెలిఫోటో షూటర్‌తో రావొచ్చు.
భారత్‌లో లాంచ్ టైమ్‌లైన్, ధర (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్ మాదిరిగానే 2026 జనవరి 20 నుంచి జనవరి 26 మధ్య లాంచ్ కావచ్చు. అయితే, కంపెనీ అధికారిక ధర ఇప్పటికీ రివీల్ చేయలేదు. శాంసంగ్ S26 అల్ట్రా రూ. 1,59,990, శాంసంగ్ S26 ప్రో రూ. 1,09,990 నుంచి శాంసంగ్ గెలాక్సీ S26 ఎడ్జ్ దాదాపు రూ. 79,990 నుంచి లాంచ్ కానుందని పుకార్లు సూచిస్తున్నాయి.