Barbados Republic : బ్రిటీష్ పాలన నుంచి విముక్తి.. 400 ఏళ్ల త‌ర్వాత‌ గ‌ణ‌తంత్ర దేశంగా బార్బ‌డోస్‌

Barbados Republic : బ్రిటీష్ పాలన నుంచి విముక్తి.. 400 ఏళ్ల త‌ర్వాత‌ గ‌ణ‌తంత్ర దేశంగా బార్బ‌డోస్‌

బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 400 ఏళ్ల త‌ర్వాత‌.. గ‌ణ‌తంత్ర దేశంగా ఆవిర్భ‌వించింది బార్బ‌డోస్‌.

Barbados Republic : బ్రిటీష్ పాలన నుంచి విముక్తి.. 400 ఏళ్ల త‌ర్వాత‌ గ‌ణ‌తంత్ర దేశంగా బార్బ‌డోస్‌

400 years later barbados declares new republic : బార్బ‌డోస్. 400 ఏళ్ల తరువాత కొత్త గ‌ణ‌తంత్ర దేశంగా ఆవిర్భ‌వించింది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో..క‌రీబియ‌న్ దీవుల్లోని బార్బ‌డోస్ బార్బ‌డోస్ కొత్త గణతంత్ర దేశంగా అవతరించింది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. ప్రపంచంలోని ఎన్నో దేశాలను తన పాలనలోకి తెచ్చుకుంది బ్రిటన్. దీంట్లో భాగంగానే ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా చేసుకుంది. 15వ శతాబ్దం నుంచి కోటి మంది అఫ్రికన్లు బ్రిటన్ పాలన కిందే ఉన్నారు. గత 400 ఏళ్లుగా బార్బడోస్‌ను శాసించిన ద గ్రేట్ బ్రిటన్. ఈక్రమంలో బ్రిటీష్ పాలనుంచి బార్బడోస్ ఎట్టలకు పూర్తి విముక్తి పొందింది. ప్రపంచంలో కొత్త గణతంత్ర దేశంగా క‌రీబియ‌న్ దీవుల్లోని బార్బ‌డోస్ ఆవిర్భ‌వించింది. బార్బ‌డోస్ బాధ్య‌త‌ల నుంచి రెండ‌వ క్వీన్ ఎలిజ‌బెత్ త‌ప్పుకోవడంతో ఆ దేశానికి పూర్తి స్వాతంత్రం లభించింది. 400 సంవత్సరాల తర్వాత చివరిగా మిగిలి ఉన్న వలస బంధాలను తెంచుకోగలిగింది బార్బడోస్. దీంతో బార్బడోస్ ప్రజల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు.

Read more : గణతంత్ర విజయం : పంచాయితీ రాజ్ వ్యవస్థ అమలు

దాదాపు 400 ఏళ్ల త‌ర్వాత బ్రిటీష్ పాల‌న నుంచి బార్బ‌డోస్‌ పూర్తి స్వేచ్ఛ పొందింది. ఇప్పటి వరకు గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న డామి సాండ్ర మాస‌న్‌..బార్బ‌డోస్ తొలి అధ్య‌క్షుడ‌య్యారు. కొత్త అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసి డామి సాండ్ర బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంతరం మాట్లాడుతు.. ‘రిపబ్లిక్ బార్బడోస్‌కు దాని స్ఫూర్తిని.. దాని మూలాన్ని అందించాలి.మనం బార్బడోస్ ప్రజలం’ అని అన్నారు. బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లోని చాంబర్‌లైన్ వంతెనపై లైనింగ్ చేస్తున్న వందలాది మంది ప్రజల ఆనందోత్సాహాల మధ్య కొత్త రిపబ్లిక్ పుట్టింది. రద్దీగా ఉండే హీరోస్ స్క్వేర్‌పై బార్బడోస్ జాతీయ గీతం ప్లే చేయబడినప్పుడు గన్ సెల్యూట్ పేలింది.

కాగా..2,85,000 జ‌నాభా ఉన్న బార్బడోస్‌ 1625 నుంచి బ్రిటీష్ బానిస‌త్వంలో మ‌గ్గిపోయింది. 1966లో ఆ దేశం బ్రిట‌న్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కానీ గణతంత్ర దేశంగా అవతరించటానికి నాలుగు శతాబ్దాలు పట్టింది. అలా ఎట్టకేలకు 400 ఏళ్ల తరువాత గణతంత దేశంగా అవతరించింది. యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, జమైకాతో సహా 15 ఇతర రాజ్యాలకు ఇప్పటికీ రాణిగా ఉన్న ఎలిజబెత్ బార్బడోస్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో బార్బడోస్ గణతంత్ర దేశంగా ఆవిర్భవిచింది. ‘ఈ రిపబ్లిక్ సృష్టి ఒక కొత్త ఆరంభాన్ని అందిస్తుందనీ..ప్రిన్స్ చార్లెస్ అన్నారు.

Read more : దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు : రిపబ్లిక్ డే అంటే ఏమిటి.. ఎందుకు జరుపుకుంటారు..

ఈ క్రమంలో కొంతమంది బార్బడోస్ ప్రజలు బ్రిటన్ తమ దేశానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా రాజకుటుంబం బానిసత్వం నుంచి విముక్తి పొందామని..ఈనాటికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని..మా వ్యాపారం నుంచి బ్రిటన్ ప్రయోజనం పొందిందని సామాజిక కార్యకర్త డేవిడ్ డెన్నీ అన్నారు. ‘మా ఉద్యమం కూడా రాజకుటుంబం నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటోదని అన్నారు.

బార్బడోస్‌‌లోని చెరుకు తోటల్లో పనుల కోసం 1627 నుంచి 1823 మధ్య నాటి బ్రిటిష్ పాలకులు 6,0000 మంది నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చారు. 15 వ శతాబ్దం నుంచి 19 వ శతాబ్దం మధ్య 10 మిలియన్లకుపైగా ఆఫ్రికన్లను ఐరోపా దేశాలు బానిసలుగా తీసుకురాబడ్డారు. అలా నల్లజాతీయులు బ్రిటీష్ పాలకుల కంబంధ హస్తాల్లో మగ్గిపోయారు.

×