Honeymoon In The Air : ఆకాశంలో హనీమూన్..కేవలం రూ.73వేలే..ఎయిర్ లైన్స్ బంపరాఫర్

ప్రతి జంట తమ పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చేసుకోవాలని ప్లాన్స్ చేసుకుంటారో.. తమ హనీమూన్‌ను కూడా అంతకు మించి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ

Plane

Honeymoon In The Air :  ప్రతి జంట తమ పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చేసుకోవాలని ప్లాన్స్ చేసుకుంటారో.. తమ హనీమూన్‌ను కూడా అంతకు మించి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ అదిరిపోయే ప్యాకేజీ ప్రకటించింది. ఆకాశంలో హనీమూన్ జరుపుకోవాలనుకుంటున్న వారికి ఇప్పుడు అమెరికాకు చెందిన లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ‘రాయల్ హనీమూన్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రత్యేక ఆఫర్ లో భాగంగా..హనీమూన్ కోసం ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకోవడానికి కేవలం 995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే భారతీయ కరెన్సీలో కేవలం 73 వేల రూపాయలు. అయితే, ఈ మొత్తం చెల్లిస్తే 45 నిమిషాల ప్రయాణానికి మాత్రం అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం కావాలనుకుంటే.. మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విమానంలో ప్రత్యేకంగా రాయల్ హనీమూన్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ విమానానికి ఒకే ఒక పైలట్ ఉంటాడు. అలాగే.. పైలట్ కాక్‌పిట్ కి, విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండదు. సో.. జంట గోప్యతకు కూడా సమస్య ఉండదు. గత ఏడు సంవత్సరాలుగా లవ్ క్లౌడ్ కంపనీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక సేవలను అందిస్తూ వస్తోంది. రిమాంటిక్ డిన్నర్, విమానంలో పెళ్లి ఫెసిలిటీ కూడా గతంలో తీసుకువచ్చింది.

ALSO READ Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం