×
Ad

హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. అపార్ట్మెంట్ల మొత్తం మంటలు.. 13 మంది సజీవదహనం.. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్

వాంగ్ ఫుక్ కోర్ట్‌లో ఎనిమిది బ్లాకులతో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్ లో దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్నాయి.

Hong Kong: హాంకాంగ్‌లో అతి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది సజీవదహనమయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు ప్రచారం.. పాకిస్థాన్‌లో దుమారం

హాంకాంగ్‌ ఉత్తర తై పోలోని అపార్ట్మెంట్ బ్లాక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 28 మంది గాయపడ్డారని అధికారులు అంటున్నారు. మంటల వల్ల భారీ అపార్ట్‌మెంట్ల చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనేక మంది లోపల చిక్కుకున్నారని అక్కడి మీడియా తెలిపింది. (Hong Kong)

తై పోలోని వాంగ్ ఫుక్ కోర్ట్‌లో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయని ఫైర్ డిపార్ట్‌మెంట్ సమాచారం అందుకుంది. వాంగ్ ఫుక్ కోర్ట్‌లో ఎనిమిది బ్లాకులతో ఉన్న హౌసింగ్ కాంప్లెక్స్ లో దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్నాయి. అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

హ్యారి చెయుంగ్ (66) అనే వ్యక్తి నాలుగు దశాబ్దాలకుపైగా ఆ కాంప్లెక్స్‌లోని బ్లాక్ 2లో నివసిస్తున్నారు. అతను మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చాలా పెద్ద శబ్దం విన్నానని, తమకు దగ్గరలోని బ్లాక్ లో మంటలు చెలరేగినట్లు చూశానని అన్నారు.

వెంటనే వెళ్లి నా వస్తువులు సర్దుకున్నాను అని చెప్పారు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ రాత్రి ఎక్కడ నిద్రపోతానో అని మాత్రమే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేకపోవచ్చని వ్యాఖ్యానించారు.

దగ్గరలోని ఓవర్హెడ్ వాక్‌వేపై ప్రజలు చేరి, భవనాల నుంచి పొగ ఎగసిపడుతుండగా దిగులుగా చూస్తూ ఫొటోలు తీస్తున్నారు. ఫైర్‌ఫైటర్లు మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగా అదే సమయంలో స్కాఫోల్డింగ్ ఫ్రేములు నేలకు కూలిపోతుండడం గమనార్హం. రోడ్డు పక్కన అనేక ఫైర్ ఇంజిన్‌లు, అంబులెన్స్‌లు నిలిపి ఉన్నాయని మీడియాకు అక్కడి వారు చెప్పారు.