హాట్ డాగ్ ఈటింగ్ కాంపీటీషన్… 75 హాట్ డాగ్స్ తిని రికార్డు సృష్టించాడు

  • Published By: Chandu 10tv ,Published On : July 17, 2020 / 07:53 PM IST
హాట్ డాగ్ ఈటింగ్ కాంపీటీషన్… 75 హాట్ డాగ్స్ తిని రికార్డు సృష్టించాడు

Updated On : July 17, 2020 / 8:29 PM IST

అమెరికాలో ప్రతి ఏటా హాట్ డాగ్ ఈటింగ్ పేరుతో ఓ పోటీ జరుగుతుంటుంది. హాట్ డాగ్స్ ఈటింగ్ అంటే బన్స్ మధ్యలో ఫ్రాంక్స్ ఉంటాయి..వాటిని తినడం. హాట్ డాగ్ ఈటీంగ్ కాంపీటిషన్ లో 10 నిమిషాల్లో ఎంత ఎక్కువ తినగలరంటే 83ఫ్రాంక్ బన్నులు.  గత 40 సంవత్సరాలుగా నాథన్ లోని ఫేమస్ కోని ఐలాండ్ హాట్ డాగ్ ఈటీంగ్ కాంపిటీషన్ నిర్వహించబడుతుంది.

ఈ సంవత్సరం  జూలై నెలలో జరిగిన ఈ ఈటీంగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న ఈటర్స్.. 75 హాట్ డాగ్ లను తిని రికార్డు సృష్టించాడు. ఇన్ని సంవత్సరాల కాంపీటీషన్ లో ఇది ఒక సరికొత్త రికార్డు.

నార్త్ కరోలినా లోని హై పాయింట్ యూనివర్శిటీ కి చెందిన ఒక ఫిజియాలజీ జేమ్స్ స్మోలిగా, 2019 లో జరిగిన హాట్ డాగ్ కాంపిటీషన్ చూస్తున్నప్పుడు ఒక వినూతన ఆలోచన కలిగింది. ఈ కాంపీటీషన్ ద్వారా ఇలా ఎక్కువగా తినే వాళ్లు ఎంత తినగలరో లెక్క కట్టవచ్చు అని నిర్ణయించుకున్నాడు.

స్మోలిగా హాట్ డాగ్ రికార్డు ప్రకారం, 39 సంవత్సారాల్లో ఈటీంగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న 152 మంది రికార్డుల ప్రకారం అత్యధికంగా తిన్నగలిగే వారు 10 నిమిషాల్లో 83 హాట్ డాగ్స్ తినగలరని నిర్ధారించాడు. అంటే ఒక నిమిషంలో 832 గ్రాములు(2300క్యాలరీలు). ఎవరైనా ఈ అత్యధిక సోర్కుకు చేరుకోకపోయినా, ప్రతి సంవత్సరం కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని స్మోలిగా చెప్పారు. ఏవిధంగా అయితే స్పోర్ట్స్ విజయాల్లో 40 శాతం మెరుగుదల ఉంటుందో, అలానే ఈ హాట్ డాగ్ ఈటీంగ్ కాంపీటషన్ లో కూడా 700 శాతం మెరుగుదల ఉందని సమెలిగా అభిప్రాయపడ్డారు.

నార్తర్నన్ ఫేమస్ హాట్ డాగ్ ఈటీంగ్ కాంపీటీషన్ లో విన్నర్స్ ఒక నిమిషంలో తినగలిగే హాట్ డాగ్ సంఖ్యను గ్రాఫ్ ఆధారంగా, చూసి తెలుసుకోవచ్చు.

ఈవిధంగా మనుషులు మాంసం తినే జంతువులకు కూడా పోటీ ఇవ్వగలరు. దీని ప్రకారం, హాట్ డాగ్ ఈటీంగ్ కాంపీటర్స్ తినగలిగే స్ధాయి ఎలుగుబంటిని మించి ఉంటుందని సమెలిగా రిపోర్ట్స్ ద్వారా తెలిపారు.

ఆహారం కొరత ఉన్న సమయంలో carnivores చాలా ఎక్కువగా తక్కువ సమయంలో తినగలరు. అలాగే స్మోలిగా‘ఈ విధంగా ఎక్కువగా తినగలటం కొన్ని సమయాల్లో చాలా ఉపయోగకరం అని గతంలో చాలా సార్లు నిరూపించారు’అని అన్నారు. కానీ, ఈ రోజుల్లో కొన్ని హాట్ డాగ్ తింటేనే జీర్ణ సమస్యలు వస్తున్నాయి. కానీ మీరు అదృష్టవంతులైతే ఈ ఛాంపియన్ షిప్ ని సొంతం చేసుకోవచ్చు.