Crimea To Russia Connecting Bridge: రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై భారీ పేలుడు.. రైలుకు మంటలు వ్యాపించి చమురు ట్యాంకర్లు దగ్దం

రష్యాను క్రిమియాకు కలిపే రోడ్డు, రైలు వంతెనపై భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో రైలుద్వారా వెళ్తున్న ఇంధన ట్యాంకులకు భారీగా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు దాటికి బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నట్లు రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ తెలిపింది

Crimea To Russia Connecting Bridge: రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై భారీ పేలుడు సంభవించింది. తూర్పు ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తర్వాత రష్యాతో విలీనమైన క్రిమియాను రష్యాతో కలిపే వంతెనపై కారు బాంబు పేలింది. ఈ పేలుడుతో భారీగా అగ్నిప్రమాదం సంభవించి బ్రిడ్జిభాగం కూలిపోయిందని రష్యా అధికారులు శనివారం తెలిపారు.

GSLV Mark – 3 Experiment: 22న జీఎస్ఎల్‌వీ- మార్క్3 ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు

ఉదయం 6.07 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రష్యాకు క్రిమియాను కలిపే కీలకమైన రోడ్డు, రైలు వంతెన ఇది. కారు బాంబు పేలుడు కారణంగా వ్యాపించిన మంటలతో రైలు ద్వారా తీసుకెళ్తున్న ఏడు ఇంధన ట్యాంకులకు మంటలు వ్యాపించి దగ్దమైనట్లు రష్యా అధికారులు తెలిపారు. ఫలితంగా వంతెన రెండు విభాగాలు పాక్షికంగా కూలిపోయిందని రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ తెలిపింది.

ఈ ఘటనపై రష్యన్ అధికారి ఒలేగ్ క్రుచ్‌కోవ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటన తరువాత వంతెనపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు చెప్పారు. మంటలను ఆర్పే పని కొనసాగుతోందని చెప్పాడు. బ్రిడ్జికి మంటలు వ్యాపించిన, ఇంధన ట్యాంకర్లు దగ్దమవుతున్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు నిర్మించి బ్రిడ్జిని 2018లో ప్రారంభించారు. ఈ వంతెన రష్యాలోని ప్రాంతాలను ఉక్రెయిన్‌లోని క్రిమియాను కలుపుతుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా.. దక్షిణాన పోరాడుతున్న రష్యన్ సైనికులకు సైనిక పరికరాలను తీసుకెళ్లడానికి, అలాగే అక్కడ ఉన్న దళాలను రవాణా చేయడానికి కీలకమైన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు