GSLV Mark – 3 Experiment: 22న జీఎస్ఎల్‌వీ- మార్క్3 ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 22న ప్రతిష్టాత్మక జీఎస్ఎల్వీ మార్క్-3 భారీ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది.

GSLV Mark – 3 Experiment: 22న జీఎస్ఎల్‌వీ- మార్క్3 ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు

NewSpace India Limited

GSLV Mark – 3 Experiment: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 22న ప్రతిష్టాత్మక జీఎస్ఎల్వీ మార్క్-3 భారీ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీనిని ప్రయోగించనున్నారు. అక్టోబర్ 22న రాత్రి 12:12 గంటలకు ఈ ప్రయోగం జరుగుతుందని జాతీయ అంతరిక్ష సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క వాణిజ్య విభాగం, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సంతకం చేసిన ఒప్పందం ప్రకారం.. జీఎస్ఎల్వీ మార్క్-3 బ్రిటిష్ స్టార్టప్ వన్‌వెబ్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుండి నింగిలోకి మోసుకెళ్లనుంది.

Idol vandalised: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేసి..

సరికొత్త రాకెట్ నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)కి పంపగలదు. భారతదేశం నుండి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్-3లో 36 OneWeb ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్ర్రో లకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ డి పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3ని లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) అని కూడా పిలుస్తారు. ఇది రెండు సాలిడ్ మోటార్ స్ట్రాప్-ఆన్, లిక్విడ్ ప్రొపెల్లెంట్ కోర్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్‌తో కూడిన మూడు దశల వాహనం. భారతదేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ వన్‌వెబ్‌లో ప్రధాన పెట్టుబడిదారు, వాటాదారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

ఈనెల 4వ తేదీన నవీకరణలో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్‌లో ఎల్‌విఎం3 యొక్క రెండు సాలిడ్ స్ట్రాప్-ఆన్ బూస్టర్‌లు, లిక్విడ్ కోర్ స్టేజ్ పూర్తిగా అనుసంధానించబడిందని ఎన్ఎస్ఐఎల్ తెలిపింది. తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత 36 వన్‌వెబ్ (లో ఎర్త్ ఆర్బిట్ బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్) ఉపగ్రహాల అనుసంధానం డిస్పెన్సర్ యూనిట్‌తో సమీకరించబడిందని NSIL తెలిపింది.