Hydrogen Balloon Explodes (Photo Credit : Google)
Hydrogen Balloon Explodes : బర్త్ డే సెలబ్రేషన్స్ అనగానే గుర్తొచ్చేది బెలూన్స్, క్యాండిల్స్, కేక్. బెలూన్లతో ఎంతో అందంగా డెకరేట్ చేస్తారు. చూడటానికి ఎంతో అట్రాక్షన్ గా ఉంటాయి. అందుకే, రంగు రంగుల బెలూన్లను పుట్టిన రోజు వేడుకల్లో వాడతారు. అయితే, ఆనందం సంగతి పక్కన పెడితే.. ఆ బెలూన్లతో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఒక్కోసారి ఆ బెలూన్స్ వల్లే ఊహించని ప్రమాదం జరగొచ్చు. ప్రాణాలకు ముప్పు ఏర్పడొచ్చు.
వియత్నాం హనోయ్ లో బర్త్ డే వేడుకల్లో ఘోరం జరిగింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ బెలూన్.. బాంబులా పేలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఆమె ముఖంపై కాలిన గాయాలు అయ్యాయి.
ఓ మహిళ పుట్టిన రోజు సందర్భంగా ఓ రెస్టారెంట్ లో పార్టీ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ సిబ్బంది అందమైన రంగు రంగుల బెలూన్లతో డెకరేషన్ చేశారు. ఆ బెలూన్స్ చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. వాటి కారణంగా ఆ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. బర్త్ డే వేడుకల్లో భాగంగా మహిళ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Also Read : చైనా వుహాన్ ల్యాబ్‌లో మరో కొత్త వైరస్.. ఇప్పటివరకు ఈ ప్రమాదకర వైరస్ గురించి ఏమేం తెలిశాయి?
ఆమె ఓ చేతిలో కేక్ పట్టుకుంది. అందులో వెలుగుతున్న క్యాండిల్స్ ఉన్నాయి. మరో చేతిలో బెలూన్ల బంచ్ పట్టుకుంది. అయితే, గాలికి ఓ బెలూన్ వచ్చి క్యాండిల్ పై పడింది. అంతే.. ఒక్కసారిగా ఓ పెద్ద బెలూన్ బాంబులా పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పెద్ద శబ్దం వినిపించింది. ఊహించని విధంగా బెలూన్ పేలిపోయి మంటలు చెలరేగడంతో ఆ మహిళ భయంతో కేకలు వేసింది. చేతిలో ఉన్న కేక్ ను, బెలూన్లను దూరంగా విసిరి పక్కకు పరుగుతీసింది.
Vietnam’da elindeki hidrojen balonu patlayan kadının yüzünde ve ellerinde ikinci derece yanık oluştu. pic.twitter.com/Ckb6DyMOPS
— TRT HABER (@trthaber) February 21, 2025
ఊహించని విధంగా చోటు చేసుకున్న ప్రమాదంతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. మంటలు చెలరేగడంతో ఆమె ముఖంపై కాలిన గాయాలు అయ్యాయి. అయితే, ప్రాణానికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఆమె ముఖంపై కాలిన గాయాలు తగ్గడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెలూన్ బాంబులా పేలి మంటలు చెలరేగిన వైనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
Also Read : బంగారం రేట్లు ఇప్పట్లో తగ్గవ్..! కారణం ఇదే.. విశ్లేషకులు చెప్పిన మాట వింటే..
బర్త్ డే వేడుకలే కాదు.. ఏ వేడుకలు అయినా సరే.. బెలూన్లతో జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. బెలూన్లు మంటలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే.. ఇదిగో ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.