చైనా వుహాన్ ల్యాబ్‌లో మరో కొత్త వైరస్.. ఇప్పటివరకు ఈ ప్రమాదకర వైరస్ గురించి ఏమేం తెలిశాయి?
ఈ కొత్త వైరస్ మెర్బెకో వైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ సబ్ వేరియంట్‌కు చెందినదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చైనాలో శాస్త్రవేత్తలు మరో కొత్త వైరస్‌ను గుర్తించారు. చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు గబ్బిలాలలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌ను మనుషుల్లో ఇంకా గుర్తించలేదు. దీన్ని ల్యాబ్‌లో గుర్తించారు.
ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. హెచ్‌కెయూ5- కోవ్-2గా పేర్కొంటున్న ఈ వైరస్‌ను గబ్బిలాల్లో గుర్తించారు. ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన సార్స్-కొవ్-2 మాదిరిగానే ఈ కొత్త వైరస్ ఉందని చెప్పారు.
Also Read: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై నాదెండ్ల మనోహర్ గుడ్‌న్యూస్
ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికలో ప్రచురించారు. వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ నేతృత్వంలో పరిశోధనలు చేసిన బృందం ఈ కొత్త వైరస్‌పై అధ్యయనం చేసి వివరాలు తెలిపింది. వారి పరిశోధన పత్రాన్ని సెల్ జర్నల్‌లో సమీక్షకు పంపారు.
ఈ కొత్త వైరస్ మెర్బెకో వైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ సబ్ వేరియంట్‌కు చెందినదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కొత్త వైరస్ హెచ్‌కేయూ5 కరోనా వైరస్ సంతతిదని చెప్పారు. దీన్ని మొట్టమొదట హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ జాబితా గబ్బిలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.
కాగా, ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎంతగా వివాదాస్పదమైందో తెలిసిందే. అప్పట్లో కరోనా వైరస్‌పై ఆ ఇన్‌స్టిట్యూట్ బాగా పరిశోధనలు చేసింది. అంతకుముందు ఆ వైరస్‌ను లీక్ చేసిన ఆరోపణలను కూడా ఎదుర్కొంది. అప్పట్లో ప్రపంచంలో కరోనా వైరస్ ఎంతటి విధ్వంసానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆ వైరస్ వల్ల లక్షలాది మంది మృతి చెందారు. కోట్లాది మందికి ఉపాధి లేకుండా పోయింది.