UK PM candidate Rishi Sunak: అసవరమైతే ఓడిపోతా.. కానీ తప్పుడు వాగ్దానాలు చేయను

ఈ సమస్యపై ప్రత్యర్థి లిజ్ ట్రూస్‭కు సునాంక్‭కు మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. కొద్ది రోజులుగా ఇదే సమస్య మీద ఇరు వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాగా, రిషి మాట్లాడుతూ ప్రజలకు పన్ను తగ్గింపులపై లిజ్ హామీ ఇచ్చారని అయితే ఇది ధనవంతులకు ఉపయోగపడుతుందే కానీ పేదలకు కాదని అన్నారు. ఇలాంటి వాగ్దానాలు తాను చేయనని, అవసరమైతే ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికైనా సిద్ధమే కానీ తప్పుడు వాగ్దానాలు మాత్రం చేయనని ఆయన అన్నారు.

I would rather lose than win on a false promise says UK PM candidate Rishi Sunak

UK PM candidate Rishi Sunak: తప్పుడు వాగ్దానాలు చేసి గెలవడం కంటే ఓడిపోవడానికే తాను ఇష్టపడతానని బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్థి, బ్రిటిష్ ఇండియన్ రిషి సునాక్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జీవన వ్యయ సంక్షోభంలో ఉన్న అత్యంత బలహీనమైన కుటుంబాలకు సహాయం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని, రాబోయే శీతాకాలంలో అదనపు సహాయం అందించడానికి కూడా కట్టుబడి ఉన్నానని అన్నారు.

ఈ సమస్యపై ప్రత్యర్థి లిజ్ ట్రూస్‭కు సునాంక్‭కు మధ్య పెద్ద చర్చ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ఇదే సమస్య మీద ఇరు వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాగా, రిషి మాట్లాడుతూ ప్రజలకు పన్ను తగ్గింపులపై లిజ్ హామీ ఇచ్చారని అయితే ఇది ధనవంతులకు ఉపయోగపడుతుందే కానీ పేదలకు కాదని అన్నారు. ఇలాంటి వాగ్దానాలు తాను చేయనని, అవసరమైతే ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికైనా సిద్ధమే కానీ తప్పుడు వాగ్దానాలు మాత్రం చేయనని ఆయన అన్నారు.

‘‘వచ్చేది శీతాకాలం. ప్రజలకు చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారికి నేను ఎంత మేరకు వీలైతే అంత చేయాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ప్రజల నుంచి డబ్బు తీసుకోకుండా వారికి సహాయం చేయడమే నా మొదటి ప్రాధాన్యత. కొవిడ్ సమయంలో చాన్స్‭లర్‭గా ఎలా పని చేశానో ప్రజలకు తెలుసు. ఆ పని తీరు ఆధారంగానే ఇప్పుడు నన్ను ఏంటనేది నిర్ణయిస్తారు’’ అని అన్నారు. ఇక తాను ప్రధానమంత్రి అయితే అని ప్రశ్నించగా.. ‘‘దేశంలో ద్రవ్యోల్బణం ప్రబలంగా ఉంది. ముఖ్యంగా విద్యుత్ బిల్లులు చెల్లించడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కుటుంబాలకు సహాయంగా ఉంటాను. నేను ప్రధాని అయితే ఆ సమయానికి హామీ ఇచ్చి ఏడాది అవుతుంది. అప్పటికి ప్రజలకు మరింత మద్దతు కావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే పని చేస్తాను’’ అని రిషి సునాంక్ అన్నారు.

Rishi Sunak: లిజ్ ట్రస్‌కు షాకిచ్చిన రిషి సునక్.. టీవీ డిబేట్‌లో అనూహ్య విజయం