India-US Army Kabaddi : మీది కూత..మాది కోతే..భారత్‌-అమెరికా సైనికుల కబడ్డీ మ్యాచ్

అమెరికన్‌ సైన్యం మన ‘కబడ్డీ’ కూత మోత మోగించారు. మన భారత జవాన్లు ఫుట్‌బాల్‌ పోటీలో గోల్స్‌ మీద గోల్స్‌ చేసి అబ్బురపరిచారు. ఈ ఆటలు మీరొస్తే కూత మామొస్తే కోత అన్నట్లుగా సాగాయి..

India-US Soldiers Play Kabaddi Joint Training Exercise : అమెరికాలోని అలాస్కాలో భారత్‌-అమెరికా ఆర్మీల మధ్య ఆటల పోటీలు జరుగుతున్నాయి. “ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్” లో భాగంగా..యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ విన్యాసాల్లో భారత్ ఆర్మీ తరపున 350 మంది జవాన్లు, అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరయ్యారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు… భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. దీంట్లో భాగంగా..కబడ్డీ, అమెరికన్ ఫుట్‌బాల్, సాకర్, వాలీబాల్ వంటి స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్చుల్లో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి.

Read more :Nude photo shoot : మృత సముద్రం వద్ద వందలమంది మోడ‌ళ్లు న్యూడ్ గా ఫోటో షూట్‌ : ఎందుకంటే

దీంట్లో భాగంగా శనివారం (అక్టోబర్ 16,2021) ఇరు దేశాల సైనికులు కలిసిపోయారు. తరువాత ఇరుదేశాల వారు జట్లుగా ఏర్పడ్డారు. కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి ఈజట్లు. అమెరికన్‌ సైన్యం మన భారతదేశంలో ప్రత్యేకత కలిగిన కబడ్డీ కూత మోత మోగించారు. అలాగే మన భారత జవాన్లు ఫుట్‌బాల్‌ పోటీలో గోల్స్‌ మీద గోల్స్‌ చేసి అబ్బురపరిచారు. ఈ ఆటలు ఎలా ఉన్నాయంటే..మీరొస్తే కూత..మేమొస్తే కోత అదేనండీ గోల్స్ అన్నట్లుగా సాగాయి. ఈ స్నేహపూర్వక ఆటల్లో రెండు దేశాల సైన్యాలు… నాలుగు మిశ్రమ జట్లు (అంటే ఒకే టీమ్ లో అమెరికా-భారత్ సైనికులు ఉంటారు) గా ఏర్పడి పోటీ పడుతు క్రీడా స్ఫూర్తిని చాటారు.

అలాస్కా అంటే మంచు ప్రాంతం. అటువంటి మంచు ప్రాంతంలోని జాయింట్ బేస్ ఎల్‌మెండోర్ఫ్ రిచర్డ్‌సన్‌లో సైనికులకు చక్కటి ఆటవిడుపు గా ఈ ఆటలు సాగాయి. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ చాలా బాగా ఎంజాయ్‌ చేశారు..చిన్నపిల్లల్లా ఆడుకున్నారు. భారత్‌-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు.

Read more :Liquor Museum : గోవాలో లిక్కర్ మ్యూజియం..ఘాటైన ’ఫెనీ‘ వెరీ స్పెషల్

ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడ్డాయని ఇరు దేశాల సైనికాధికారులు తెలిపారు. భారత్‌- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహనతో పాటు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు 2021 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్‌లో జరిగిన విషయం తెలిసిందే. 14 రోజుల వ్యాయామంలో భాగంగా ఐక్యరాజ్యసమితి ఆదేశం ప్రకారం ఉమ్మడి శిక్షణ ఉంటుందని భారత సైన్యం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు