Nude photo shoot : మృత సముద్రం వద్ద వందలమంది మోడ‌ళ్లు న్యూడ్ గా ఫోటో షూట్‌ : ఎందుకంటే

మృత సముద్రం వద్ద వందలమంది మోడ‌ళ్లు న్యూడ్ గా ఫోటో షూట్‌ లో పాల్గొన్నారు. ఎందుకంటే..

Nude photo shoot : మృత సముద్రం వద్ద వందలమంది మోడ‌ళ్లు న్యూడ్ గా ఫోటో షూట్‌ : ఎందుకంటే

Hundreds Pose Nude For Tunick Shoot In Israel Near Dead Sea

Nude photo shoot in israel near dead sea : 200 మంది మోడ‌ళ్లు ఒకే చోట ఉంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. అటువంటిది వారు న్యూడ్ (నగ్నంగా) ఉంటే..నగ్నంగా ఫోటో షూట్ చేస్తే..! నగ్నంగా ఎందుకు చేశారు? ఇజ్రాయెల్ లోని మృత సముద్రం (dead sea) వద్ద జరిగిన ఈ విశేషానికి దాని వెనుక ఉన్న కారణమేంటీ? అంటే..ప్రకృతి పరంగా జరిగే విపత్తులు కొన్ని అయితే..మనిషి చేసే విధ్వంసాలు మరోపక్క. అటువంటిదే జరిగింది మృత సముద్రం విషయంలో..

ఆదివారం (అక్టోబర్ 17,2021)మధ్యాహ్నాం 2.45 గంటల సమయంలో ఇజ్రాయిల్‌లోని మృత సముద్రం వద్ద 200 మంది మోడ‌ళ్లు .. న‌గ్నంగా షూట్‌లో పాల్గొన్నారు. మోడ‌ళ్లు అంద‌రూ శ‌రీరానికి తెల్లటి రంగు పులుముకుని ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికాకు చెందిన 19 నుంచి 70ఏళ్ల మహిళలు, పురుషులు పాల్గొన్నారు. చెందిన ఇజ్రాయిల్‌లో నీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది. అయితే డెడ్ సీ జలాలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిపై అవ‌గాహ‌న క‌ల్పించటానికే ఈ మోడళ్ల న్యూడ్ ఫోటో షూట్ వెనుక ఉన్న అసలు ఉద్ధేశ్యం. ఇజ్రాయిల్ ప‌ర్యాట‌క శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్పెన్స‌ర్ ట్యునిక్ అనే 54 ఏళ్ల ఫోటోగ్రాఫ‌ర్ ఈ ఫోటో షూట్ చేశారు.

Read more : మోడ్రన్ డ్రెస్సులతో..70 ఏళ్ల నటి ఫోటో షూట్..పిచ్చెక్కిస్తున్న పిక్స్ పై ట్రోలింగ్

ప్ర‌తి ఏడాది డెడ్ సీ సుమారు ఓ మీట‌రు మేర ఎండిపోతోంది. ఇజ్రాయిల్‌, జోర్డాన్‌లు ఎగువ ప్రాంతంలో నీటి మ‌ళ్లించ‌డంతో డెడ్ సీ ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే..మరోవైపు మైనింగ్ కూడా స‌మ‌స్య‌గా మారింది. దీంతో ఈ పరిస్థితిపై అవగాహన కల్పించటానికి పర్యాటక శాఖ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా మోడళ్లకు తెల్లరంగే ఎందుకు పూసారు అంటే..మృత సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే మృతసముద్రం నీళ్లలో కూర్చున్నా..పడుకున్నా మునిగిపోకుండా నీళ్లపైనే తేలుతుంటారు.

Read more : Kylie Jenner photoshoot :‘రక్తం’లో తడిసి ముద్దైనట్లుగా నటి ఫోటోషూట్..తిట్టిపోస్తున్న అభిమానులు

ఈ సముద్రపు నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు తెల్లగా ఉంటుంది కాబట్టి ఈ మోడళ్లకు తెల్లటి రంగు వేశామని ఫోటో గ్రాఫర్ ట్యునిక్ తెలిపారు. అంతేకాదు..మరో కథ కూడా చెప్పాడు. ఇజ్రాయిల్ అంటే ఏసుక్రీస్తు నేపథ్యమైన దేశం. క్రీస్తు అంటే బైబిల్. క్రైస్తవుల పరుశుద్ధ గ్రంథం బైబిల్‌.ఈ బైబిల్ ఓ కథనం ఉంది. లోతు అనే వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుంద‌నే కథనం ఉంది.దాన్ని దృష్టిలో పెట్టుకుని మోడ‌ళ్ల‌కు తెలుపు రంగు వేసిన‌ట్లు టునిక్ తెలిపారు. ఫోటోగ్రాఫ‌ర్ ట్యూనిక్ గ‌తంలో కూడా ఇటువంటి ఫోటో షూట్ చేశారు. అప్పడు 1000మంది మోడ‌ళ్ల‌తో ఉప్పునీటి స‌ముద్ర‌మైన డెడ్ సీ వ‌ద్ద న్యూడ్ ఫోటోలు తీశారు.