Taliban Joy Rides : కాబూల్‌లో తాలిబ‌న్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి!

అప్ఘాన్ మరోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్లు మస్త్ ఖుషీగా గడిపేస్తున్నారు. వీధుల్లో ఐస్‌క్రీమ్‌లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Taliban Fighters

Afghanistan Taliban fighters joy rides : అప్ఘానిస్తాన్ తాలిబన్లు ఆక్రమించినున్నారని తెలిసి ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాలిబన్ల రాకతో అమెరిక సైనిక బలగాలు ఉపసంహరణపై అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్ఘాన్ ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. తాలిబన్ల క్రూర పాలనలో బతకలేమంటూ అప్ఘాన్లు దేశం వదిలి పారిపోతున్నారు. ప్రపంచమంతా ఆందోళనలో ఉంటే.. అప్ఘాన్ మరోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్లు మాత్రం మస్త్ ఖుషీగా గడిపేస్తున్నారు.
Ram Gopal Varma: తాలిబన్లు ఎలాంటి జంతువులంటే.. ఆర్జీవీ ట్వీట్స్!

రోడ్లపై జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దేశ‌మంతా గంద‌ర‌గోళ పరిస్థితుల్లో ఉంటే.. తాలిబ‌న్ల‌ు విజయోత్సావంలో మునిగితెలుతున్నారు. కాబూల్‌ను ముట్టడించిన కొన్ని రోజుల తరువాత.. తాలిబాన్ యోధుల బృందం తుపాకులను పట్టుకుని సరదగా బంపర్ కార్లు నడుపుతూ కనిపించారు. వీధుల్లో ఐస్‌క్రీమ్‌లు తింటూ పండుగ చేసుకుంటున్నారు. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఆటలు ఆడేస్తున్నారు. జిమ్‌ల్లో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తాలిబన్ల చెర నుంచి తప్పించుకుని ప్రాణాలు నిలుపుకునేందుకు అప్ఘాన్లు ఆరాటపడుతున్నారు.


తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న ఆనందంలో పార్టీలు చేసుకుంటున్నారు. తాలిబన్లు సరదాగా ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరొక వీడియోలో, తాలిబాన్లు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నట్టు కనిపించారు. దీనిపై ఒక ట్విట్టర్ యూజర్ వీరంతా ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారా? అని కామెంట్ పెట్టారు.