Ram Gopal Varma: తాలిబన్లు ఎలాంటి జంతువులంటే.. ఆర్జీవీ ట్వీట్స్!

ప్రపంచంలో ఏ మూలాన ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. రాజకీయాల నుండి సైన్స్, ఆచారాల వరకు అన్నిటి మీద వర్మ స్పందన ఉ

Ram Gopal Varma: తాలిబన్లు ఎలాంటి జంతువులంటే.. ఆర్జీవీ ట్వీట్స్!

Ram Gopal Varma

Ram Gopal Varma: ప్రపంచంలో ఏ మూలాన ఏది జరిగినా దానిపై స్పందించే వ్యక్తి బహుశా రామ్ గోపాల్ వర్మ ఒక్కరేనేమో. రాజకీయాల నుండి సైన్స్, ఆచారాల వరకు అన్నిటి మీద వర్మ స్పందన ఉండనే ఉంటుంది. ఎప్పుడు ఏ అంశంపై ఆయన స్పందన ఉంటుందో.. ఏ టైంలో అయన ఏ ట్వీట్ చేస్తారో ఆయనకే తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ల అరాచక పాలన మొదలైన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై కూడా వర్మ స్పందించి ట్వీట్ చేశారు.

తాలిబన్లు ఎలాంటి జంతువులో మీరే చూడండి అంటూ వీడియోస్ ట్వీట్ చేశారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరాన్ని ఆక్రమించుకొని ఏకంగా ప్రెసిడెంట్ కోటలో జల్సాలు చేశారు. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్‌ చేసిన వర్మ.. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్‌ చేశాడు.

దీంతో పాటు కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ చిన్న పిల్లలు ఉపయోగించే ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని రైడింగ్ చేస్తూ ఆడుకుంటుంటున్న వీడియో కూడా షేర్ చేసిన వర్మ.. ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్ అంటూ కామెంట్‌ చేశారు. ఇప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వాటికీ ఆర్జీవీ కామెంట్స్ కూడా జత కావడంతో మరింత ఆసక్తిగా మారాయి.