సెల్ఫ్ క్వారంటైన్ లోకి WHO చీఫ్

WHO Chief Self-Isolates ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అథ‌నామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా బాధిత వ్యక్తిని తాను కలిసినట్టు గుర్తించి..సెల్ఫ్‌ ఐ‌సొలేషన్ లోకి వెళ్తున్నట్లు టెడ్రోస్ ప్రకటించారు.

తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని ఆయన చెప్పారు. డబ్ల్యుహెచ్ఒ మార్గదర్శకాలకు అనుసరించి కొన్నిరోజులు తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండనున్నట్లు సోమవారం(నవంబర్-1,2020) టెడ్రోస్ ట్వీట్ చేశారు. ఇంటి నుంచే పని చేయనున్నట్టు టెడ్రోస్ తెలిపారు.



మనమందరం కరోనా కట్టడికి వైరస్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని టెడ్రోస్ కోరారు. ఈ విధంగా మనం COVID19 ప్రసార వ్యాప్తి చైన్ ను బ్రేక్ చేయగలమని అన్నారు. వైరస్ ని అణచివేచి… ఆరోగ్య వ్యవస్థలను కాపాడదాయని ఆయన అన్నారు. ప్రజల జీవితాలను కాపాడటానికి మరియు హాని కలిగించేవాటి నుంచి వారిని రక్షించడానికి తాను,WHO సహచరులు భాగస్వాములతో నిమగ్నమవ్వడం కొనసాగిస్తామని టెడ్రోస్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు