నేనొక Idiot , లాక్‌డౌన్‌ను ఉల్లంఘించా: న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి. పదవి ఊడాల్సిందేకాని, కరోనా రక్షించింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జల్సాలు చేసి తనని తానే నిందించుకున్నారు. ఆయనతో పాటు ఓ స్టార్ రగ్బీ ప్లేయర్ కూడా తాను చేసిన పనిని తప్పని ఒప్పుకున్నాడు. ఐసోలేషన్ పీరియడ్‌లోనే కొద్ది రోజుల క్రితం మౌంటైన్ బైకింగ్‌కు వెళ్లినందుకు హెల్త్ మినిస్టర్ డేవిడ్ క్లార్క్ విమర్శలకు గురైయ్యాడు.

అంతేకాకుండా కుటుంబంతో కలిసి బీచ్ వాక్ కోసం 20 కిలోమీటర్ల దూరం వెళ్లి చక్కర్లు కొట్టానని చెప్పుకొచ్చాడు. ఇదంతా చెప్పి తాను ఒక Idiot అని తనకు తానే తిట్టుకున్నాడు. ప్రధానమంత్రి జాసిండా ఆర్దెమ్ ఆరోగ్య శాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మామూలు రోజుల్లో అయితే మంత్రిపై యాక్షన్ తీసుకునే వాళ్లమని ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ 19పై పోరాడేందుకు  మంత్రి అవసరం ఉంది కాబట్టి వదిలేస్తున్నాం. ఇప్పుడైనా అంతకంటే బెటర్ గా సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం అని కట్ చేశారు. 

క్రిస్ట్ చర్చ్ వేదికగా కాంటర్ బర్రీ క్రూసడర్స్ రగ్బీ టీం సోమవారం ట్రైనింగ్ అయింది. దానిని ఆల్ బ్లాక్ రిచీ మౌంగా వీడియో రికార్డు చేశారు. దీనిపై న్యూజిలాండ్ రగ్బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ రాబిన్‌సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే ఓ వ్యక్తి దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే సూపర్ మార్కెట్ లో ఉండే వారి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు పోలీసులు. న్యూజిలాండర్లు వేల మంది రూల్స్ బ్రేక్ చేస్తున్నారని.. పోలీసుల మాట వినకుండా మార్చి 25నుంచి మొదలైన లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్నారంటూ వందల్లో కంప్లైంట్లు వస్తున్నాయి. న్యూజిలాండ్ పోలీసులు ఒక్కరే కాదు.. స్కాట్ లాండ్ లోనూ అదే పరిస్థితి.