Pak soldiers: పాకిస్థాన్ ఆర్మీని భారీ దెబ్బకొట్టిన బీఎల్ఏ.. 12మంది సైనికులు హతం..

బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్ ఆర్మీ వాహనంపై దాడి చేసింది.

Pakistan Army

Pak soldiers: పాకిస్థాన్ ఆర్మీకి దెబ్బమీద దెబ్బ పడుతుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దీంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తాజాగా గట్టి షాకిచ్చింది.

Also Read: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ.. ఆపరేషన్ సిందూర్ లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ మృతి

బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా దాడులు చేస్తోంది. సైనిక వాహనాలు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాక్ ఆర్మీ వాహనం లక్ష్యంగా ఐఈడీ దాడికి పాల్పడింది. ఈ పేలుడుతో 12మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు.

Also Read: ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు.. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే..

కుచ్చి జిల్లాలోని మాచ్ జనరల్ ఏరియాలో బలూచిస్తాన్ లిబరేషన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ భద్రతా దళాల వాహనాన్ని ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (IED)తో లక్ష్యం చేసుకున్నారని పాకిస్థాన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పేలుడు లో ఆర్మీ వాహనంలో ఉన్న 12 మంది సైనికులు మరణించారని, వారిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారని పాక్ ఆర్మీ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ పేలుడులో వాహనం కూడా ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిర్మూలించడానికి ఆపరేషన్ చేపట్టినట్లు సైన్యం తెలిపింది.

 

గతవారం పాకిస్థాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో 10మంది బీఎల్ఏ వేర్పాటు వాదులు హతమయ్యారని పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, పాకిస్తాన్ ఆర్మీని, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని బీఎల్ఏ గతంలో ఇటువంటి దాడులకు పాల్పడింది. మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ కు 440 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బీఎల్ఏ వేర్పాటు వాదులు హైజాక్ చేశారు. ఇందులో 21మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే.