మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ.. ఆపరేషన్ సిందూర్ లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ మృతి

మెరుపు దాడులతో భారత సైన్యం జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు బిగ్ షాకిచ్చింది.

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ.. ఆపరేషన్ సిందూర్ లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ మృతి

Masood Azhar

Updated On : May 7, 2025 / 2:41 PM IST

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలను భారత్ సైన్యం ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. అర్థరాత్రి దాటిన తరువాత 1.05 గంటల నుంచి 1.25 గంటల వరకు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ మెరుపు దాడులతో జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు భారీ షాక్ తగిలింది.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. ఆ 25 నిమిషాల్లోనే అంతా ఖతం.. కీలక విషయాలు వెల్లడించిన సైన్యం

భారతసైన్యం పాకిస్థాన్ లోని బహవల్‌పూర్‌లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన మెరుపుదాడుల్లో జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారు. ఈ విషయాన్ని మసూద్ అజార్ చెప్పారని బీబీసీ ఊర్దూ నివేదించింది. మరణించిన వారిలో అజార్ సోదరి, ఆమె భర్తతోపాటు అతని మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని జైషే మహ్మద్ చీఫ్ ప్రకటనను ఉటంకిస్తూ బీబీసీ ఊర్దూ మీడియా నివేదించింది. భారత దాడుల్లో అజార్, అతని తల్లి సన్నిహితుడు, మరో ఇద్దరు సన్నిహితులు కూడా మరణించారని ఆ ప్రకటనలో పేర్కొంది.

Also Read: ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు.. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే..

పాకిస్థాన్ లోని పెద్ద నగరాల్లో బహవల్‌పూర్‌ ఒకటి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలో మీటర్ల దూరంలో .. లాహోర్ నుండి 400 కిలో మీటర్లు దూరంలో ఉంది. బహవల్ పూర్ లోని మర్కజ్ సుబాన్ పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహ్మద్ కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్ పై చాలా దాడులకు బహవల్ పూర్ నుంచే ప్రణాళికలు రచించారు. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ శిబిరాన్ని ఉస్మాన్ – ఓ – అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇది సంస్థ నియామకాలు, నిధుల సేకరణ, బోధనలకు కేంద్రంగా పనిచేస్తుంది.