మోడీ సార్.. చేత‌ల్లో చూపించండి : స్వీడ‌న్ బాలిక మెసేజ్

  • Publish Date - February 22, 2019 / 05:27 AM IST

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి స్వీడన్ కు చెందిన 16ఏళ్ల ఓ అమ్మాయి మెసేజ్ పంపింది. పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తగిన చర్యలు తీసుకోవాలంటు స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థంబెర్గ్  పంపించిన ఓ వీడియో మెజేస్ వైరల్ గా మారింది. 2018  డిసెంబరులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పులపై  నిర్వహించిన కాప్‌24 సదస్సులో  పాల్గొన్న గ్రేటా థంబెర్గ్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. 
 

ఈ స్పీచ్ లో గ్రేటా ప్రపంచ నేతలకు గ్రెటా ఓ వీడియో సందేశాన్ని పంపింది.ఇందులో భాగంగా అస్‌పెర్జర్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న గ్రేటా.. భారత ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ.. ‘‘‘డియర్‌ మిస్టర్‌ మోడీ.. పర్యావరణ పరిరక్షణపై మీరు మాటలకే పరిమితం కావడం ద్వారా భవిష్యత్ తరాలకు విలన్‌గా కనిపించొద్దు అంటు కోరింది. ఈ అంశంపై తగిన చర్యల్ని తీసుకోవాలని కోరింది. కర్భన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడతామంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నోసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 121 దేశాల సహకారంతో 2030 నాటికి సోలార్‌ పవర్‌ ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాటైన ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ గురించి అంతర్జాతీయ వేదికపై మోడీ ప్రచారం చేశారు. 
 

మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఈ సదస్సుకు  రాలేదనీ..చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుందని ప్రపంచ దేశాధి నేతలను కోరింది గ్రేటా థంబెర్గ్.

Read Also:ఇదీ లెక్క : తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు
Read Also:ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also:బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్