పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 100 కోట్ల డాలర్లు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. నిన్న జరిగిన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో దీనికి ఆమోదం తెలిపారని చెప్పింది.
అప్పుల ఊబి, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు 700 కోట్ల డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి గతంలో ఐఎంఎఫ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వాయిదాల పద్ధతిలో రుణాన్ని ఇస్తారు. ఇందులో భాగంగా ఇప్పుడు 100 కోట్ల డాలర్లు ఇచ్చింది. పాకిస్థాన్‌కు 700 కోట్ల డాలర్ల రుణాన్ని మూడేళ్ల వ్యవధిలో గత ఏడాది జూలైలో ఐఎంఎఫ్ ఒప్పుకుంది.
Also Read: రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10 వేల తగ్గింపు.. ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదు!
వాయిదాల్లో ఈ రుణాన్ని విడుదల చేయడానికి ఆరు నెలలకు ఓ సారి సమీక్ష జరుపుతుంది. మొత్తం ఏడు వాయిదాల్లో రుణాన్ని ఇవ్వాల్సి ఉంది. ఐఎంఎఫ్ ఇస్తున్న రుణాలను పాకిస్థాన్ ప్రధానంగా ఉగ్రవాదం కోసం ఖర్చు చేస్తోందని భారత్ మొదటి నుంచి చెబుతోంది. దీనివల్ల పాకిస్థాన్ భారత్‌కి మాత్రమే కాకుండా ప్రపంచానికి ముప్పుగా మారుతుందని భారత్ తెలిపింది.
పాకిస్థాన్‌కు ఈ సారి వాయిదాల్లో భాగంగా 100 కోట్ల డాలర్లు ఇచ్చే ప్రతిపాదనను నిన్న ఐఎంఎఫ్ బోర్డు మీటింగ్‌లో భారత్ వ్యతిరేకించింది. ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంది. అయితే, భారత్ ఓటింగ్ దూరంగా ఉండడం ఏంటని, వ్యతిరేకంగా ఓటేస్తే భారత వైఖరిని సమర్థంగా చెప్పినట్లు అయ్యేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పాక్‌కు రుణ సాయం చేయడంపై ఐఎంఎఫ్‌పై భారత్ నుంచి విమర్శలు వస్తున్నాయి.