Imran Khan alleges former Army chief Gen Bajwa wanted to get him killed
Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాపై కొద్ది రోజులుగా విరుచుకుపడుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. తాజాగా తీవ్ర ఆరోపణ చేశారు. తాను చనిపోవాలని బజ్వా కోరుకున్నాడని ఆయన ఆరోపించారు. లాహోర్‌లో ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఈ ఆరోపణ చేశారు. నవంబరు 3న లాహోర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వజీరాబాద్ ప్రాంతంలో ఓ ట్రక్కుపై నిలబడి ఉన్న ఇద్దరు ముష్కరులు ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఇమ్రాన్ పాదయాత్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ సందర్భాన్ని ఇమ్రాన్ ఊటంకించారు.
వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ఇంకా ప్రసారం కాలేదు. కానీ, పాకిస్తాన్ ప్రముఖ దినపత్రిక డాన్ ఈ వివరాలను వెల్లడించింది. తన ప్రభుత్వం మీద బజ్వా డబుల్ గేమ్ ఆడారని, తనను ‘ప్లేబాయ్’ అంటూ వ్యాఖ్యానించారని ఇమ్రాన్ ఇంతకు ముందు ఆరోపణలు చేశారు. వాస్తవానికి తను ప్రధానిగా దిగిపోయినప్పటి నుంచి బజ్వాపై ఇమ్రాన్ విమర్శలు చేస్తున్నప్పటికీ, ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం తన విమర్శల్లో ఘాటు పెంచారు.
Delhi: రోడ్డుపై సంగీత కళాకారుడిని నిలువరించిన ఢిల్లీ పోలీస్.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం ఇమ్రాన్ స్పందించారు. ‘‘అవును, అవన్నీ నిజమే, అయితే ఇప్పుడేంటి?’’ అన్న విధంగా ఇమ్రాన్ స్పందించడం పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఏడాది క్రితం తనపై ఈ వ్యాఖ్యలు చేశారని మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఊటంకించారు. బజ్వా వ్యాఖ్యలు వాస్తవమంటూనే, ఇలాంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్ యువతకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.