Imran Khan Ex-Wife
Imran Khan Ex-Wife Marriage: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మళ్లీ పెళ్లిచేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ఖాతా ద్వారా ఆమె వెల్లడించారు. రెహమ్ ఖాన్ వృత్తిరిత్యా జర్నలిస్టు. ఆమె ఇమ్రాన్‌కు రెండో భార్య. 6 జనవరి 2015న ఇమ్రాన్, రెహమ్ ఖాన్‌లు వివాహం చేసుకున్నారు. కానీ, వీరి వివాహ బంధం కేవలం తొమ్మిది నెలలకే విచ్ఛిన్నమైంది. వారిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి ఆమె ఇమ్రాన్ ఖాన్ పై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
https://twitter.com/RehamKhan1/status/1606182680605126657
రెహమ్ ఖాన్ గతంలో చేసుకున్న రెండు వివాహాలు విఫలం కావడంతో ప్రస్తుతం ఆమె మూడో వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఆమె కొత్తగా పెళ్లిచేసుకోబోయే వ్యక్తిని తన ట్విటర్ ఖాతాద్వారా పంచుకుంది. ‘ చివరకు నేను విశ్వసించగల వ్యక్తిని కనుగొన్నాను’ అంటూ పేర్కొంది. మోడల్, నటుడు మీర్జా బిలాల్‌తో తాను వివాహం చేసుకున్నట్లు వెల్లడింది. మత పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లికి సంబంధించిన ఫొటోను రెహమ్ ఖాన్ ట్విటర్‌లో పంచుకుంది.
https://twitter.com/RehamKhan1/status/1606184712460206081?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606184712460206081%7Ctwgr%5Efb5d7a990cc28fb54c8a579d5d35cda41bca044f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fworld%2Fformer-pakistan-pm-imran-khans-wife-reham-khan-gets-married-for-third-time-know-about-her-new-hubby-mirza-bilal-baig-2552561.html
శుక్రవారం అమెరికాలో జరిగిన ఈ వేడుకలో భర్త మీర్జా బిలాల్ తల్లిదండ్రులు, నా కొడుకు వకీల్ పాల్గొన్నట్లు ఆమె తెలిపింది. మరోవైపు పాక్ మాజీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖన్ గతంలో మూడవ భార్యగా బుష్రా వట్టూను వివాహం చేసుకున్నాడు.