Pakistan Hindu Woman
Pakistan : పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ హిందూ మహిళ పోటీ చేయనుంది. పాకిస్థాన్‌లో జరగనున్న ఎన్నికల్లో జనరల్ సీటుకు ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా ఓ హిందూ మహిళ పోటీ చేయడం సంచలనం రేపింది. సవీరా ప్రకాష్ బునెర్ జిల్లాలోని పీకే-25 జనరల్ సీటుకు అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. సవీర ప్రకాష్ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ టిక్కెట్‌పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ALSO READ : Terrorists : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు…ఇంటెలిజెన్స్ వెల్లడి
16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8, 2024న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. సవీరా తండ్రి డాక్టర్ ఓమ్ ప్రకాష్ ఇటీవల పదవీ విరమణ చేశారు. అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన సవీరా బునెర్‌లోని పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తమ కమ్యూనిటీ అభ్యున్నతికి, మహిళల అభివృద్ధికి, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి కృషి చేస్తానని సవీరా చెప్పారు.
ALSO READ : Indian Navy : వాణిజ్య నౌక దాడి ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో భారత్ మూడు యుద్ధ నౌకల మోహరింపు
తన తండ్రి అడగుజాడల్లో నడుస్తానని సవీరా ప్రకాష్ పేర్కొన్నారు. తాను వైద్యురాలిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులకు సేవలు చేస్తూ తాను చట్టసభకు ఎన్నికవ్వాలనుకుంటున్నానని సవీరా వివరించారు. బునర్ పాకిస్థాన్‌లో విలీనమై 55 సంవత్సరాలు పట్టిన ప్రాంతంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక మహిళ ముందుకు రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.