Terrorists : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు…ఇంటెలిజెన్స్ వెల్లడి

భారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్‌లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.....

Terrorists : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు…ఇంటెలిజెన్స్ వెల్లడి

China-made weapons

Updated On : December 26, 2023 / 10:34 AM IST

Terrorists : భారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్‌లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లో సైన్యంపై దాడి చేయడానికి ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని తాజాగా వెల్లడైంది.

ALSO READ : Indian Navy : వాణిజ్య నౌక దాడి ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో భారత్ మూడు యుద్ధ నౌకల మోహరింపు

ఇటీవల పూంచ్ జిల్లాలో ఐదుగురు సైనికుల మృతి, రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి ఘటన జరిగిన తర్వాత కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో ఆర్మీ సిబ్బంది చైనా ఆయుధాలను గుర్తించారు. జేఎమ్, లష్కర్ వంటి షాడో టెర్రరిస్ట్ సంస్థలు, టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు చైనీస్ ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని తాజాగా వెలుగుచూసింది. జమ్మూకశ్మీరులోని పుల్వామాలోని ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ : Dense Fog : పలు రాష్ట్రాల్లో కమ్ముకున్న పొగమంచు…ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం

నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా భారత ఆర్మీ పోలీసులతో కలిసి జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిపింది. పుల్వామాలోని పంజు,గమిరాజ్ వద్ద ముగ్గురు అనుమానిత వ్యక్తుల నుంచి పిస్టళ్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భారత సైనిక విభాగానికి చెందిన చినార్ కార్ప్స్ బలగాలు జరిపిన తనిఖీల్లో ఆయుధాలు దొరికాయి. ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.