Russia – Ukraine War: అసలే బాంబుల గోల.. మధ్యలో పెళ్లి మేళా

ఓ వైపు రష్యా బలగాలు విసురుతున్న బాంబులు.. మరోవైపు బాంబు షెల్టర్ లో సీక్రెట్ మోగిన పెళ్లి బాజాలు అక్కడున్న వారిలో యుద్ధం తాలూకు భయాలు పక్కకుపెట్టేసి కాసేపు నవ్వులు పూయించాయి.

Ukraine Subhan 10tv

Russia – Ukraine War: ఓ వైపు రష్యా బలగాలు విసురుతున్న బాంబులు.. మరోవైపు బాంబు షెల్టర్ లో సీక్రెట్ మోగిన పెళ్లి బాజాలు అక్కడున్న వారిలో యుద్ధం తాలూకు భయాలు పక్కకుపెట్టేసి కాసేపు నవ్వులు పూయించాయి. బాంబు షెల్టర్ లో జరిగిన పెళ్లి గురించి బెలారస్ మీడియా ఫొటోలను షేర్ చేస్తూ ఇలా కూడా ఉపయోగపడుతున్నాయాంటూ రాసుకొచ్చింది.

‘గురువారం ఉదయం బాంబు షెల్టర్ లో ఓ జంట వివాహ బంధంతో ఒకటైనట్లు తీసిన వీడియో వైరల్ అయింది. ఒడెసా సిటీలో రష్యా బలగాలు దాడి చేస్తుండగా ఈ ఘటన జరిగింది’ అంటూ బెలారస్ మీడియా ట్విట్టర్ లో పోస్టు చేసింది.

ట్విట్టర్ హ్యాండిల్ లో అప్ లోడ్ చేసిన ఫొటోల్లో పెళ్లి కూతురి చేతిలో పూల గుచ్ఛం ఉంది. పెళ్లి కొడుకు న్యాయపరంగా పెళ్లి చేసుకున్నట్లుగా సంతకం చేసేందుకు ముందుకవంగాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన అతిథుల ఆశీర్వాదాలు తీసుకుంది ఆ జంట.

Read Also: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా

మార్చి 3 గురువారానికి రష్యా దాడులు మొదలుపెట్టి 8రోజులు కావొస్తుంది. యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సామాన్యులలోని ఆ ప్రేమ జంట.. బతికిన కొద్ది కాలమైన తన అనే మనిషితో ఉండాలని వివాహ బంధంతో ఒకటైంది. ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో 2వేల మంది పౌరులు చనిపోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది.