Flags on Russian Rockets: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా: భారత్ జెండాకు మాత్రం గౌరవం

తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన అన్ని దేశాలపై రష్యా సైతం ఆంక్షలు విధించింది. ఏ చిన్న విషయాన్నీ కూడా రష్యా వదలడం లేదు.

Flags on Russian Rockets: రాకెట్ పై ఇతర దేశాల జెండాలను తొలగించిన రష్యా: భారత్ జెండాకు మాత్రం గౌరవం

Flags

Flags on Russian Rockets: యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం.. రష్యాకు మింగుడు పడడంలేదు. దీంతో తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన అన్ని దేశాలపై రష్యా సైతం ఆంక్షలు విధించింది. ఏ చిన్న విషయాన్నీ కూడా రష్యా వదలడం లేదు. చివరకు యుద్ధానికే ముందు..ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలను సైతం ప్రస్తుతం రష్యా తనంతట తానే రద్దు చేసుకునేలా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈనేపధ్యంలో శుక్రవారం చేపట్టనున్న ఓ రాకెట్ ప్రయోగాన్ని సైతం రష్యా నిలిపివేసింది. రష్యా అంతరిక్ష సంస్థ “రోస్కాస్మోస్” నేతృత్వంలో ప్రయోగించనున్న ఈ “వన్ వెబ్ రాకెట్” ప్రయోగాన్ని నిలిపివేసింది రష్యా. అంతేకాదు ఈ ప్రయోగంలో భాగస్వామ్యంగా ఉన్న అమెరికా, జపాన్, యూకే దేశాల జెండాలను తొలగించింది రోస్కాస్మోస్. అయితే రాకెట్ పై భారత్, దక్షిణ కొరియా జెండాలను మాత్రం తొలగించలేదు.

Also Read: Russia ukraine war : పుతిన్‌ను తల నరికినా..అరెస్ట్ చేసినా మిలియన్‌ డాలర్లు బహుమతి : సైన్యానికి రష్యా కుబేరుడు ఆఫర్‌

యుక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో.. ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ లాంచ్ ప్యాడ్ నుంచి రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్.. వివిధ దేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను తీసుకువెళ్లాల్సి ఉంది. యూకేకి చెందిన “వన్ వెబ్” అనే సంస్థ భాగస్వామ్యంగా ప్రపంచ వ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేలా వివిధ దేశాలకు చెందిన ఇంటర్నెట్ సంస్థలు, అంతరిక్ష సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా ఉన్నాయి. సోయుజ్ రాకెట్ పై ఇతర దేశాల జెండాలను కనిపించకుండా చేయడంపై రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ స్పందిస్తూ.. “బైకనూర్ వద్ద లాంచర్లో కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మరింత అందంగా కనిపిస్తుందని” ట్వీట్ చేశారు.

Also read: Roman Abramovich : పుతిన్‌తో సంబంధాలు.. రష్యన్‌ బిలియనీర్‌‌కు చిక్కులు…!

యుక్రెయిన్ పై రష్యా ఆక్రమణ కొనసాగుతూనే ఉన్న, రాకెట్ ప్రయోగాన్ని యధావిధిగా కొనసాగిస్తామని రోస్కాస్మోస్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే రష్యాపై ఇతర దేశాల ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడు ఏజెన్సీ తన నిర్ణయాన్ని మార్చుకుని రాకెట్ ను ప్రయోగించకూడదని నిర్ణయించుకుంది. ముఖ్యంగా యూకే ప్రభుత్వంపై రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా రాకెట్ ప్రయోగానికి రోస్కాస్మోస్ నిరాకరించింది. వన్ వెబ్ ఆధారిత శాటిలైట్ ఇంటర్నెట్ ను యూకే ప్రభుత్వం సైనిక కార్యకలాపాలకు వినియోగించరాదని రష్యా ఆంక్షలు విధించింది. సైనికేతర వినియోగానికే ఈ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటామని యూకే కట్టుబడి ఉంటేనే ఈ ప్రయోగం జరుగుతుందని… ఏ విషయాన్ని 48 గంటల్లోగా తెలపాలంటూ బుధవారం నాడు రష్యా.. యూకే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.