Afganisthan Earthquake : శిథిలాల్లో బతుకులు..భూకంపంతో అత్యంత దుర్భరంగా అఫ్ఘాన్‌ ప్రజల జీవితాలు..

ఎవరిని కదిలించినా ఏడుపే.. ఎక్కడ చూసినా అంబులెన్సుల ధ్వనే.. కుటుంబాన్ని కోల్పోయి ఒకరు.. కుటుంబ పెద్దను కోల్పోయి మరొకరు.. అన్నీ పోయి అనాథగా మిగిలిన వారు మరొకరు.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఇవే ! ఇప్పటికే అఫ్ఘానిస్తాన్‌ జనాలు చాలా బాధలు పడుతున్నారు. పేదరికం దారుణంగా ఉంది.

Afganisthan Earthquake : ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి.. పీకల్లోతు కష్టాల్లో అల్లాడుతోన్న అఫ్ఘానిస్తాన్‌ను.. ప్రకృతి విలయాలు నరకం చూపిస్తున్నాయ్. అసలు ఇప్పుడు అఫ్ఘానిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయ్. జనాల కష్టాల నుంచి బయటపడే మార్గం ఉందా.. ప్రపంచ దేశాల మీద పరోక్షంగా ఉన్న బాధ్యత ఏంటి..

ఎవరిని కదిలించినా ఏడుపే.. ఎక్కడ చూసినా అంబులెన్సుల ధ్వనే.. కుటుంబాన్ని కోల్పోయి ఒకరు.. కుటుంబ పెద్దను కోల్పోయి మరొకరు.. అన్నీ పోయి అనాథగా మిగిలిన వారు మరొకరు.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఇవే ! ఇప్పటికే అఫ్ఘానిస్తాన్‌ జనాలు చాలా బాధలు పడుతున్నారు. పేదరికం దారుణంగా ఉంది. ఆ దేశం దశాబ్దాల యుద్ధాన్ని భరించింది. గత ఏడాది తాలిబాన్లు అధికారంలోని వచ్చినప్పటి నుంచీ పలు దేశాలు అఫ్గానిస్తాన్‌కు సహాయ నిధిని నిలిపివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన సహాయం ఎంతవరకు అందుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Also read : Afghan Quake : కష్టాలకు కేరాఫ్‌గా అఫ్ఘానిస్తాన్‌..ఓవైపు జనాల ఆకలి కేకలు..మరోవైపు ప్రకృతి ప్రకోపాలు

భూకంపానికి ముందు సరైన ఆరోగ్య వసతులు, సౌకర్యాలు అంతో ఇంతో ఉండేవి. ఐతే భూకంపం వాటిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. బాధితులకు సాయం చేసేందుకు సంస్థలు ముందుకు వస్తున్నా… కమ్యూనికేషన్, నీటి సదుపాయాలు సవాల్‌గా మారాయ్. బాధితులకు ఆహారం, మందులు, అత్యవసర ఆశ్రయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇప్పటికే పేదరికంతో కొట్టుమిట్టాడుతోన్న అఫ్ఘాన్‌వాసుల జీవితాలను భూకంపం.. మరింత కోలుకోలేని దెబ్బ తీసింది. తిండి లేకపోయినా.. గూడు ఉందని సంతోషించేవాళ్లు.. భూకంపం ధాటికి అవీ కూలిపోయాయ్. దీంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది.

కడుపు నింపుకోవడానికి.. కడుపు చీల్చుకున్న ఘటనలు కూడా అఫ్ఘానిస్తాన్‌లో ఆ మధ్య కనిపించాయ్. దేశంలో చాలామంది డబ్బుల కోసం అవయవాలను అమ్ముకున్న ఘటనలు… దేశ పరిస్థితికి అద్దం పట్టాయ్. ఇక అటు అఫ్ఘానిస్తాన్‌లో ఆకలి కష్టాలు భారీగా పెరగనున్నాయని గతంలోనే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తక్షణమే మానవతా సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో ప్రస్తుతం 2కోట్ల 28లక్షల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని.. ఇందులో 87 లక్షల మంది ఆకలి చావులకు చేరువయ్యారని ఆ సంస్థ లెక్కలు చెప్తున్నాయ్.

Also read : Afghanistan Earthquake: అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం.. 250 మంది మృతి!

అఫ్ఘానిస్తాన్‌ దేశ జనాభాలో దాదాపు 30శాతం మందికి పైగా కనీసం ఒక్క పూట భోజనం కూడా దొరకడం లేదు. ఓ వైపు ఆకలి.. మరోవైపు అనారోగ్యం.. జనాల ప్రాణాలు తీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రకోపం.. అఫ్ఘాన్‌వాసుల పాలిట శాపంగా మారుతోంది. ఇక దీనికితోడు తాలిబన్ల అర్థం లేని పాలన.. జనాలకు మరింత నరకంగా మారుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలతో.. జనాలు చుక్కలు చూస్తున్నారు. దేశంలో చాలావరకు వ్యవసాయం పరిశ్రమలు మూతపడ్డాయ్. దీంతో సగానికి పైగా జనాలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక అటు పెరిగిపోయిన నిత్యావసర ధరలతో.. అవి కొనే స్థోమత లేక అల్లాడుతున్నారు.

తాలిబన్ పాలనే శాపం అనుకుంటే.. ప్రకృతి ఇప్పుడు పగపట్టినట్లు కనిపిస్తోంది. రాజకీయ కారణాలు పక్కనపెట్టి ప్రపంచ దేశాలన్నీ సాయం అందించాల్సి అవసరం ఉంది. ఇప్పటికే చాలా దేశాలు.. అఫ్ఘాన్‌కు నిధులు ఆపేశాయ్. ప్రపంచబ్యాంక్ కూడా అప్పుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు ఆకలి.. మరోవైపు అనుకోని ఆపదతో అల్లాడుతోన్న అప్ఘానిస్తాన్‌కు ప్రపంచ దేశాలు చేయి అందించాల్సిన అవసరం ఉంది.

ట్రెండింగ్ వార్తలు