Russia president putin
Russia vs Ukraine War: యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఐక్య రాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. రష్యా విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ)లో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 193 మంది సభ్యులున్న ఐరాసలో 143 దేశాలు ఐకాస తీర్మానానికి అనుకూలంగా ఓటే వేయగా, కేవలం ఐదు దేశాలు (రష్యా, బెలారస్, ఉత్తర కొరియా, సిరియా, నికరాగ్వా) తీర్మానికి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. 35 దేశాలు ఓటింగ్ దూరంగా ఉన్నాయి. వీటిలో భారత్ దేశం కూడా ఒకటి.
గత నెల 30న యుక్రెయిన్‌లోని దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి. క్రెమ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందని తెలిపారు. విలీన ఒప్పందంపై ఆ నాలుగు ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారు. అయితే, ఈ నాలుగు ప్రాంతాల విలీనాన్ని ఖండిస్తూ అల్బానియా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై రికార్డెడ్ ఓటింగ్ నిర్వహించాలని కోరింది.
https://twitter.com/IndiaUNNewYork/status/1580303744272633856?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580303744272633856%7Ctwgr%5Eaf2aa7b61296f57a32bd05e4295b71db0b4f947d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Findia-abstains-from-un-vote-condemning-russias-annexation-of-ukraine-3426797
రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. మాస్కో డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్ సహా 107 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఓటు వేశాయి. తాజాగా బుధవారం రష్యా విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. 143దేశాలు.. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండడం వల్ల తీర్మానం ఆమోదం పొందింది. అయితే, ఉక్రెయిన్‌లో యుద్ధం తీవ్రతరం కావడం పట్ల భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఐరాస శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.